Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Of Baroda E-KYC: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వీడియో కాల్‌ ద్వారానే ఆ పని పూర్తి..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మరో అడుగు ముందుకేసి మరో కొత్త సేవను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్‌లు ఇప్పుడు తమ శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన పద్ధతిలో కేవలం కొన్ని నిమిషాల్లో డిజిటల్‌గా రీ-కేవైసీని పూర్తి చేసే అవకాశం కల్పించింది. అర్హత ఉన్న వ్యక్తిగత నివాస వినియోగదారుల కోసం వీడియో రీ-కేవైసీని ప్రారంభించినట్లు బ్యాంక్  ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు.

Bank Of Baroda E-KYC: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. వీడియో కాల్‌ ద్వారానే ఆ పని పూర్తి..
Bank Of Baroda
Follow us
Srinu

|

Updated on: Aug 24, 2023 | 9:30 PM

పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసకుంటున్నాయి. ముఖ్యంగా డిపాజిట్‌, విత్‌డ్రా విషయాల్లో ఈ మార్పులు గణనీయంగా పెరిగింది. అయితే భారతదేశంలో ఆధార్‌ ఎంట్రీ తర్వాత బ్యాంకింగ్‌ సేవలు మరింత పుంజుకున్నాయి. ముఖ్యంగా కస్టమర్ల గుర్తింపు బ్యాంకులకు మరింత ఈజీగా మారింది. దీంతో కొత్త అకౌంట్లు కూడా చాలా వేగంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మరో అడుగు ముందుకేసి మరో కొత్త సేవను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్‌లు ఇప్పుడు తమ శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన పద్ధతిలో కేవలం కొన్ని నిమిషాల్లో డిజిటల్‌గా రీ-కేవైసీని పూర్తి చేసే అవకాశం కల్పించింది. అర్హత ఉన్న వ్యక్తిగత నివాస వినియోగదారుల కోసం వీడియో రీ-కేవైసీని ప్రారంభించినట్లు బ్యాంక్  ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు. ఈ సేవలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది డిజిటల్‌గా కేవైసీ (నో యువర్ కస్టమర్), ఆవర్తన నవీకరణను పూర్తి చేయడానికి వినియోగదారులకు ప్రత్యామ్నాయ, మరింత అనుకూలమైన పద్ధతి అని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం. 

వీడియో రీ-కేవైసీ చేయడం ఇలా?

వీడియో కేవైసీ సదుపాయాన్ని పొందేందుకు కస్టమర్‌లు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడిన నివాసితులు అయి ఉండాలి. వారి ఆధార్ నంబర్, ఒరిజినల్ పాన్ కార్డ్ కలిగి ఉండాలని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొదటి దశలో కస్టమర్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్క ఆన్‌లైన్‌లో కొంత ప్రాథమిక సమాచారాన్ని సమర్పించడం ద్వారా ఆన్‌లైన్ రీ-కేవైసీ దరఖాస్తును పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌తో వీడియో కేవైసీ కాల్ నిర్వహిస్తారు. వీడియో కాల్ కోసం కస్టమర్‌లకు వారి ఒరిజినల్ పాన్ కార్డ్, ఖాళీ తెల్లటి కాగితం, నీలం లేదా నలుపు పెన్ అవసరం. వీడియో రీ-కేవైసీ కాల్‌లు అన్ని పని దినాలలో పని వేళల్లో (ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6:00 వరకు) చేపట్టవచ్చు. వీడియో సెషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కస్టమర్ వివరాలు బ్యాంక్ రికార్డులలో అప్‌డేట్ అవుతాయి. అలాగే కస్టమర్‌కు నిర్ధారణ టెక్స్ట్‌ మెసేజ్‌ పంపుతామని బ్యాంక్ తెలిపింది.

రీ-కేవైసీ ముఖ్య మా?

రీకేవైసీ అనేది కాలానుగుణ నవీకరణ. ఈ వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాలి. కేవైసీ అప్‌డేట్ గడువు ముగిసినప్పుడు కస్టమర్‌లు తమ కేవైసీ పత్రాలను బ్యాంక్‌తో వెంటనే అప్‌డేట్ చేయాలి. వీడియో రీ-కేవైసీ సదుపాయం రోల్‌అవుట్ రీ-కేవైసీ ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ముఖ్యంగా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. రీ- కేవైసీ అప్‌డేట్ పెండింగ్‌లో ఉన్న బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా పూర్తి స్థాయి డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను తెరవడానికి 2021 సంవత్సరంలో వీడియో కేవైసీ ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఇప్పుడు తన కస్టమర్ల సౌలభ్యం కోసం రీ- కేవైసీ సౌకర్యం కోసం వీడియో కేవైసీను పొడిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..