Today Gold Price: పసిడి ధరలు పైపైకి.. తగ్గేదిలేదంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold Price Today: ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా అమలు అవుతాయి. కానీ ఈ ధరలలో GST ఉండదు. మీరు బంగారం తీసుకున్న తర్వాత ధరలు మరింతగా పెరగవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, పన్ను కారణంగా

Today Gold Price: పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ట్రేడింగ్ వారంలో రెండవ మూడో రోజు బుధవారం అక్టోబర్ 1న భారత బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.117,450 దాటింది. అదే సమయంలో వెండి కిలోకు రూ.1,51,000 కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జారీ చేసిన రేట్లు దేశవ్యాప్తంగా అమలు అవుతాయి. కానీ ఈ ధరలలో GST ఉండదు. మీరు బంగారం తీసుకున్న తర్వాత ధరలు మరింతగా పెరగవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, పన్ను కారణంగా బంగారం లేదా వెండి ధర ఎక్కువగా ఉంటుందని గమనించాలి .
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,810 వద్ద ట్రేడవుతోంది.
- అలాగే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,660. ఏపీలోని విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,660.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,610.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,660.
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా గమనిస్తున్నారు మరియు ఫలితంగా, వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Thalapathy Vijay: దక్షిణాది సూపర్ స్టార్ దళపతి విజయ్ భార్య గురించి మీకు తెలుసా? ఆమె నికర విలువ ఎంత?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం




