రూ.200ల ఈ మొక్క మీ జీవితాన్ని మార్చేస్తుంది.. ఒక్క చెట్టుతో వేలల్లో ఆదాయం.. మీరు కోటీశ్వరులైనట్టే..!
సాంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి వ్యవసాయంలో కొత్త పద్ధతులను ప్రయోగిస్తున్నారు రైతులు. సాంప్రదాయ సేద్యం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం, చీడపీడల బెడద, మార్కెట్ మాయజాలంతో విసుగెత్తిపోయిన అన్నదాత విభిన్న పంటల వైపు మొగ్గుచూపుతున్నాడు. ఇప్పుడు చాలా మంది రైతులు మహోగని చెట్ల పెంపకం ప్రారంభించారు. ఈ మహోగని చెట్ల అమ్మకం ద్వారా రైతుకు 60 నుండి 70 లక్షల లాభం వస్తుంది.

కేవలం 200 రూపాయలకు కొని నాటిన ఈ మొక్క కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని కోటీశ్వరుడిని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవును, మహోగనికి అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉంది. దాని మన్నిక, ఎరుపు-గోధుమ రంగు కలిగి ఉండే కలప వాటర్‌ఫ్రూవ్ లక్షణాల కారణంగా దీనిని చెట్ల రాజు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు విదేశాలలో అధిక డిమాండ్ ఉంది. అందువల్ల ఈ చెట్టును డబ్బుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని డిమాండ్ పెరుగుతున్నందున రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఈ మహోగనిని పెంచుతున్నారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది.
మహోగని చెట్టుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. మహాగని చెట్టు దగ్గర కూడా దోమలు ఉండవు. దోమల ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ మొక్క దోమలను తరిమికొడుతుంది. ఈ మొక్క ఆకులు, విత్తనాలను దోమల నివారణలు, క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు, విత్తనాలతో అనేక ఇతర ఉపయోగాలున్నాయి. రంగులు, వార్నిష్‌లు, సబ్బులు, అనేక మందుల తయారీకి వీటిని ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు నుండి అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. మహోగని చెట్లు పెరగడానికి సారవంతమైన నేల అవసరం. డ్రైనేజీ బాగా ఉండాలి. ఇది సాధారణ pH విలువలో సాగు చేయబడుతుంది. బలమైన గాలులు వీచే చోట ఈ చెట్లను నాటకూడదు. కొండ ప్రాంతాల్లో సాగు చేయరు.
మహోగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తరువాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఫర్నిచర్ తయారీ, నౌకానిర్మాణం, సంగీత వాయిద్యాలు, లగ్జరీ ఇంటీరియర్స్ వంటి వాటిల్లో ఈ చెట్ల బెరడును ఉపయోగిస్తారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా అమ్మకానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్కలు వేడి వాతావరణంతో పాటు అతి శీతల వాతావరణంలో పెరగవు. కాబట్టి, మన రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చెట్ల పెంపకానికి చాలా అనుకూలమైనవి అంటున్నారు నిపుణులు.
మహోగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్‌క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషదాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయ పురుగు మందులగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహాగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోని ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.
మహోగని కలపను 100 సంవత్సరాలు నీటిలో ఉంచినా, అది చెడిపోదు. కాకపోతే, ఈ చెట్టు పెరగడానికి 10 నుండి 13 సంవత్సరాలు పడుతుంది. దీనిని క్యూబిక్ అడుగుకు రూ.1,500 నుంచి రూ.2,500 చొప్పున అమ్ముతారు. ఆధునిక కాలంలో ఈ మహోగని చెట్ల పెంపకం రైతులకు ఒక వరంలా మారుతోంది. పర్యావరణానికి హాని కలిగించకుండా భూమిని ఉపయోగించి నేడు రైతులు మహోగని చెట్లను పెంచుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం








