AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Purchase: బంగారు అభరణాల కొనుగోలులో భారత్‌ రెండో స్థానం.. ప్రపంచ స్వర్ణ మండలి కీలక నివేదిక

మన దేశంలో బంగారానికి మహిళలు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. ధర ఎంత పెరిగినా.. బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా బంగారం..

Gold Purchase: బంగారు అభరణాల కొనుగోలులో భారత్‌ రెండో స్థానం.. ప్రపంచ స్వర్ణ మండలి కీలక నివేదిక
Gold Price
Subhash Goud
|

Updated on: Jan 20, 2023 | 10:37 AM

Share

మన దేశంలో బంగారానికి మహిళలు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. ధర ఎంత పెరిగినా.. బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా బంగారం కొనుగోళ్లు మరింతగా ఉంటాయి. ప్రతి శుభకార్యానికి, పండగలకు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయం. దీంతో మనదేశంలో ఎంత బంగారం కొనుగోలు చేశారనేది లెక్కలు బయటకు వచ్చాయి. 2021లో భారతీయులు 611 టన్నుల ఆభరణాలను కొనుగోలు చేశారని, చైనా 673 టన్నులతో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో భారత్‌ ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది.

భారత మార్కెట్లో బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. తెలిపింది. అయితే పూర్తిగా బంగారంతో తయారు చేసిన సాధా అభరణాలు విక్రయాలు 80 నుంచి 85 శాతం జరుగుతున్నాయని పేర్కొంది. అవి కూడా 22 క్యారెట్లవే. ఇక 18 క్యారెట్ల ఆభరణాల విక్రయాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నట్లు నివేదికలో తెలిపింది. మొత్తం అభరణాల వ్యాపారంలో పెళ్లికూతుర్లకు కొనుగోలు చేసేది 50 నుంచి 55 శాతం ఉంది. రోజువారీగా ధరించే నగల వాటా 40-45 శాతంగా ఉంటోందని, ఫ్యాషన్‌ జువెలరీ అభరణాల వాటా 5-10 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు 55-58 శాతం ఉన్నట్లు తెలిపింది.

అభరణాలు కొంటున్న వారు వీరే..

ఇక రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారిలో ఎక్కువ మంది అభరణాలు కొంటుంటే, తర్వాత స్థానాల్లో రూ.5 నుంచి రూ.10 లోలు, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు ఉన్నట్లు తెలిపింది. ఇక దేశీయ వ్యాపారంలో 40 శాతం వాటాతో దక్షిణ భారతదేశం అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

దేశం ప్రజలకు బంగారంతో విడదీయలేని బంధం కలిగి ఉందని, దేశీయంగా పోల్చినట్లయితే యువతకు బంగారంపై ఆసక్తి తగ్గుతోందని డబ్ల్యూజీసీ తెలిపింది. అభరణాలు ఉండటం సామాజిక హోదా కలిగి ఉంటుందని, ధర పెరుగుతున్నందున సంపద సృష్టికి ఉపయోగపడేలా పాతతరం భావిస్తోందని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ఆభరణాల తయారీ, ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి