Gold Rate: అమ్మ బాబోయ్‌.. రూ.90 వేలకు చేరనున్న బంగారం ధర.. ఎప్పటి వరకు అంటే..!

Gold Rate: బంగారం కొనుగోలు చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతీయులకు పసిడి అంటే అత్యంత ఇష్టం

Gold Rate: అమ్మ బాబోయ్‌.. రూ.90 వేలకు చేరనున్న బంగారం ధర.. ఎప్పటి వరకు అంటే..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 2:01 PM

Gold Rate: బంగారం కొనుగోలు చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతీయులకు పసిడి అంటే అత్యంత ఇష్టం. బంగారం విషయంలో పుత్తడికి ఉన్న విలువే వేరు. ధర ఎంత పెరిగినా.. మహిళలు కొనుగోలు చేయక మానరు. అయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.50 వేల సమీపంలో ఉన్న బంగారం ధర భవిష్యత్‌లో ఏకంగా రూ.90 వేలకు పరుగులు పెట్టనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎప్పటికల్లా బంగారం ధర భారీగా పెరగనుంది..?

గతంలో రూ.60 వేలకు చేరువలో వెళ్లిన బంగారం ధర.. ప్రస్తుతం రూ.50వేల సమీపంలో ఉంది. ఇక వచ్చే 3-5 సంవత్సరాలలో బంగారం రెట్టింపు స్థాయిలో వెళ్లనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రూ.90 వేలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. క్వాడ్రిగా ఇగ్నియో ఫండ్‌ మేనేజర్ డియెగో పారిల్లా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 3 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు పరుగులు పెట్టనుందని అంచనా వేశారు. కరోనా వైరస్ కారణంగా కేంద్ర బ్యాంకులు ఉద్దీపణ ప్యాకేజీలు ప్రకటించాయని, దీని వల్ల అవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. అందువల్ల రానున్న కాలంలో పసిడి రేటు మరింతగా పరుగులు పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే కోవిడ్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ బంగారం ధర రూ. 2075 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిందని ఆయన గుర్తుచేశారు. 1800 డాలర్ల వద్ద స్థిరపడుతూ వచ్చిందన్నారు. బంగారం బిజినెస్‌లో ఏకంగా 25 ఏళ్ల అనుభవం కలిగిన ఈయన అభిప్రాయాల ప్రకారం చూస్తే.. బంగారం ధర వచ్చే ఐదేళ్ల కాలంలో 10 గ్రాములకు రూ.90 వేలకు చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి : PAN Card: పాన్‌ కార్డు ఎందుకు..? ఏయే లావాదేవీలకు అవసరం అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు ఉన్న వారికి అలర్ట్‌.. ఈ సేవలు నిలిపివేత.. తప్పకుండా తెలుసుకోండి..!

Vehicle Insurance Claim: మీ వాహనానికి ఇన్సూరెన్స్‌ ఉందా..? అయితే క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!