AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: భారీగా కుదేలవ్వనున్న బంగారం ధరలు.. గోల్డ్ ప్రియులకు ఇదొక డేంజర్ బెల్.!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనుగోళ్లతో మార్కెట్‌లు సందడిగా ఉండాల్సిన సమయం. కానీ గోల్డ్ షాపుల్లో ఆ సందడి లేదు. బంగారం కొనాలన్న ఆలోచనే పక్కన పెట్టేశారు జనం. కానీ గోల్డ్‌ రేట్‌ మాత్రం పగ్గాలు లేకుండా దూసుకుపోతోంది. మార్కెట్ సూత్రం ప్రకారం..డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి. మరి గోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగడం లేదు..?

Gold Price: భారీగా కుదేలవ్వనున్న బంగారం ధరలు.. గోల్డ్ ప్రియులకు ఇదొక డేంజర్ బెల్.!
Gold Price
Ravi Kiran
|

Updated on: Jan 29, 2026 | 7:11 AM

Share

పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతోంది బంగారం రేటు. ఏ రోజుకారోజు..సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బంగారం ధర పెరుగుతోందంటే.. అదికొన్నవాళ్లలో ఆనందం ఉండాలి. కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్లలో ఒకరకమైన భయం మొదలయింది. ఎందుకంటే.. బంగారం ధర నిజంగా పెరుగుతోందా..? లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా..? అనే సందేహం వారిని వెంటాడుతోంది. గతంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు కారణం. 2025లోనే బంగారం ధర 60 శాతం పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు.. అసాధారణమైన పెరుగుదల. ఇది ఒకరకంగా ‘బబుల్’ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని.. సామాన్యులు ఆ ట్రాప్‌లో పడవద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల ‘రిపోర్ట్’ మాయాజాలం కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు.. గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి పెద్ద పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు “బంగారం ఇంకా పెరుగుతుంది” అంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తాయి. సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటారు. అదే సమయంలో.. ఆ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని మెల్లగా అమ్ముకుని లాభాలు తీసుకుంటారు. చివరికి రేట్లు పడిపోయాక..వాళ్లు లాభాల్లో ఉంటారు. గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ఏదైనా వస్తువు ధర సప్లై-డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్‌లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జే.పీ మోర్గాన్ బ్యాంక్ “స్పూఫింగ్” అనే టెక్నిక్ వాడి గోల్డ్‌ రేట్‌ను అమాంతం పెంచేసింది. కొనాలని లేకపోయినా లక్షల కొద్దీ “ఫేక్ ఆర్డర్స్” పెట్టి, రేటు పెరిగాక ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడమే “స్పూఫింగ్” టెక్నిక్. ఈ నేరం బయటపడ్డంతో ఆ బ్యాంకు ఏకంగా 920 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 వేల 600 కోట్ల రూపాయల జరిమానా కట్టింది. దీన్ని బట్టి మార్కెట్ మ్యానిపులేషన్ నిజమేనని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ బంగారం ధర ‘బుడగలా’ పేలిపోయే అవకాశం ఉందన్న వాదనకు గతంలో జరిగిన ఘటనలు కూడా ఆధారంగా నిలుస్తున్నాయి. 1980లో బంగారం రేటు పీక్స్‌కి వెళ్లింది. దీంతో అందరూ ఎగబడి కొన్నారు. తర్వాత 57% పడిపోయింది. మళ్ళీ ఆ రేటు రావడానికి 25 ఏళ్లు పట్టింది. లేటెస్ట్‌గా 2011లో కూడా మళ్ళీ అలాగే పెరిగింది. తర్వాత 45% క్రాష్ అయ్యింది. అది కోలుకోవడానికి 4 ఏళ్లు పట్టింది. ఇప్పుడు 2026లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు అనలిస్ట్‌లు. స్టాక్ మార్కెట్ కుప్పకూలితే ఇన్వెస్టర్లు నగదు కోసం బంగారం, వెండి ఈటీఎఫ్‌లను విక్రయించడం ప్రారంభిస్తారు. తక్కువ ధరలో దొరుకుతున్న షేర్లను కొనడానికి వీటిలో లాభాలను స్వీకరించడం సహజం. దీనివల్ల బంగారం, వెండి ధరల్లో పెద్ద ఎత్తున దిద్దుబాటు వచ్చే అవకాశం ఉంటుంది.

సామాన్యుల్లో కొనాలనే ఆసక్తి ఉంటేనే ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి వారికి ఆ సెంటిమెంట్ పోతే.. దాని ధర ఎంత పెరిగినా, తగ్గినా పట్టించుకునే వాళ్లు ఉండరు. ఇప్పటికే పేదలకు దూరమైన బంగారం..మధ్య తరగతి ప్రజలకు కూడా త్వరలోనే అందని సరుకుగా మారిపోనుంది. ప్రస్తుతం మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ ఉన్నా కూడా..జనం బంగారం కొనడం తగ్గించేశారు. రిటైల్ మార్కెట్లో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఇది ఒక డేంజర్ సిగ్నల్. ఎప్పుడైతే సామాన్యులు కొనలేరో.. అప్పుడు రేట్లు పడటం ఖాయం. మార్కెట్ విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. సో..బంగారం కొనాలనుకునే వాళ్లు..బీ కేర్ ఫుల్..

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి