Gold Rate Today: దిగొస్తున్న పసిడి.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
నేడు మే 26న భారతదేశ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,807లుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,989లుగా ఉంది. ఇకపోతే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.7,355లు పలుకుతోంది. ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అటువంటి పరిస్థితిలో మీరు బంగారం, వెండి కొనాలని ఆలోచిస్తుంటే, లేదా బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టయితే..ఇది మీకు సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే…ప్రస్తుతం పసిడి పరుగులకు చిన్న కళ్లెంపడినట్టుగా కనిపిస్తుంది. బంగారం, వెండి ధరలు ఏ రోజు కారోజు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. కానీ, మే 26న గోల్డ్ రేట్ కాస్త దిగొచ్చింది. భారతదేశ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ బంగారం ధరలు తగ్గాయి.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులు మినహా సామాన్యులకు అందనంత ఎత్తులోనే పుత్తడి ధరలు ఉంటున్నాయి. నేడు మే 26న భారతదేశ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,807లుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,989లుగా ఉంది. ఇకపోతే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.7,355లు పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,040, 24 క్యారెట్ల ధర రూ.98,220 గా ఉంది.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల రేటు రూ.98,070 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
– విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
– విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
ఇకపోతే, భారతదేశ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము రూ.110.80లుగా కాగా, కిలో వెండి ధర రూ1,10,800గా పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..