స్విట్జర్లాండ్‌లో దారుణం.. మంచుకొండల్లో ఐదుగురు స్కీయర్లు మృతి
స్విట్జర్లాండ్‌లోని రింప్‌ఫిష్‌హార్న్ పర్వత సమీపంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఐదుగురు స్కీయర్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో స్కీలు విడిచి ఉన్నట్టు అత్యవసర సిబ్బంది గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను గుర్తించారు. ఈ సంఘటన కాంటన్ వాలాయిస్‌లోని ప్రాసిక్యూటర్ల కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది.

ఉత్తర ఇటలీ సరిహద్దుకు సమీపంలోని నైరుతి స్విట్జర్లాండ్‌లోని ప్రాంతంలో గాలి, భూమి శోధనల తర్వాత, రెస్క్యూ సిబ్బంది అడ్లెర్గ్లెట్షర్ హిమానీనదం సమీపంలో మృతదేహాలను కనుగొన్నారు. మృతిచెందిన ఐదుగురి గుర్తింపులు ఇంకా నిర్ధారించబడలేదని తెలిసింది. తదుపరి దర్యాప్తు ప్రారంభించబడిందని సంబంధిత అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి