Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 11, 2021 | 5:25 AM

Gold Price Today: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలకు.. బ్రేక్ పడుతూ వస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. తాజాగా స్వల్పంగా పెరిగింది. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో బంగారం ధరలపై అధిక ప్రభావం చూపుతుందని, దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శనివారం (డిసెంబర్‌ 11)న దేశీయంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,110 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 వద్ద ఉంది. ► ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 వద్ద కొనసాగుతోంది. ► తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. ► పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,810 వద్ద కొనసాగుతోంది. ► కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,030 ఉంది. ► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. ► తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. ► ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది. ► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Privatization of Banks: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు రెడీ.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం..

ఎవ్వరైనా సరే దుబాయ్‌ వెళితే బంగారం కొంటారు..! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..?

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..