భగ్గుమంటున్న బంగారం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?

Gold Rates Today: దేశంలోని బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతూ.. ఆల్‌టైం హైకి చేరుకుంది పసిడి ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 70 వేల మార్క్ దాటింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,480కి చేరింది.

భగ్గుమంటున్న బంగారం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
Gold Price
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2024 | 8:21 AM

దేశంలోని బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతూ.. ఆల్‌టైం హైకి చేరుకుంది పసిడి ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 70 వేల మార్క్ దాటింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,480కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,610గా ఉంది. ఇక వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే.. మరో రూ. 100 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.82,100 చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుండటంతో.. దేశీయంగా ధరలు బలపడటానికి కారణాలవుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,760కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,630గా ఉంది.

  • చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,460 కాగా, 24 క్యారెట్ల పసిడి రూ.71,410గా ఉంది

  • కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.64,610గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480గా ఉంది.

  • బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో బంగారం ధరలు ఒకేతీరుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,610 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,480కి చేరింది.

  • విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,610 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480 గా ఉంది.

  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,610 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,480 గా ఉంది