Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలిలా..!

Gold Rate Today: ఒక వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గినా.. గురువారం మాత్రం భారీగానే...

  • Subhash Goud
  • Publish Date - 6:09 am, Thu, 15 April 21
Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలిలా..!
Gold Price

Gold Rate Today: ఒక వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గినా.. గురువారం మాత్రం భారీగానే పెరిగింది. ఒక్కో చోట్ల ఒక్క విధంగా పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.400 వరకు పెరుగగా, ఢిల్లీలో రూ. 250 వరకు పెరిగింది. బెంగళూరులో 10 గ్రాముల ధరపై రూ.400 వరకు పెరుగగా, ముంబైలో మాత్రం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల ధరపై రూ.90 వరకు పెరిగింది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పెరిగింది. ఒక చోట తక్కువగా పెరుగుదల ఉంటే, మరో చోట ఎక్కువగా ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయానికి ఏ రేట్లు ఉన్నాయో తెలుసుకొని వెళితే మంచిదని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

దాదాపు ఈ నెలలో 14 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2,330 వరకు పెరిగింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2,540 వరకు పెరిగింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్ వస్తే… బంగారం ధరలు మరింత పడిపోతాయేమో అనే భయాలతో కొంత మంది ఇన్వెస్టర్లు… పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో నిన్నటి బంగారం ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. తాజాగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,120కి చేరుకుంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,690వద్ద కొనసాగుతోంది.

► ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉంది.

►కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080 వద్ద ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 43,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 వద్ద కొనసాగుతోంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం ధరలు ఒకేలా ఉంటున్నాయి తప్ప మార్పులు ఉండటం లేదు.

ఇవీ కూడా చదవండి: Gold Loan: బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి

Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌..! అరలక్షకు చేరువలో ఉన్న బంగారం ధర… ( వీడియో )