AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగల సీజన్‌ వచ్చేస్తోంది.. మరి బంగారం ధర తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు..

భారతదేశంలో బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండగల సీజన్ దగ్గరపడుతున్నా డిమాండ్ తగ్గలేదు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, సాంప్రదాయ కొనుగోలు విధానాలు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు లో ధరలు మరింత పెరగవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.

పండగల సీజన్‌ వచ్చేస్తోంది.. మరి బంగారం ధర తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు..
Gold
SN Pasha
|

Updated on: Sep 13, 2025 | 10:08 AM

Share

భారత్‌లో బంగారం ధరలు ఇటీవల ఆల్ టైమ్ రికార్డ్‌కు చేరుకున్నాయి. పండుగలు, వివాహాల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ, ధర విపరీతంగా పెరిగినా డిమాండ్ మాత్రం స్థిరంగానే ఉంటుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధర ఇంతలా పెరిగేందుకు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, సాంప్రదాయ కొనుగోళ్ల విధానాలే కారణం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్పెక్ట్ బులియన్ అండ్‌ రిఫైనరీ CEO దర్శన్ దేశాయ్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక ధోరణులు ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి అని అన్నారు. ఇండియన్ బులియన్ అండ్‌ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్, ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, బలమైన పెట్టుబడిదారుల కోరిక, US ద్రవ్య విధానం సడలింపు అంచనాల కారణంగా బంగారం ఇటీవల ఆల్ టైమ్ గరిష్టాలను తాకిందని అన్నారు. అయితే ఇప్పట్లో ధరలు తగ్గడం కష్టం, కాబట్టి ధర తగ్గుదల కోసం వేచి ఉండటం కంటే కొనుగోలు వ్యూహం సురక్షితం అని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ప్రస్తుతం ఔన్సుకు 3,650 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనాలు భవిష్యత్ ధరలకు విస్తృత స్పెక్ట్రమ్‌ను సూచిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఔన్సుకు 3,650 డాలర్లు, సిటీగ్రూప్ ఔన్సుకు 4,000 డాలర్లు, గోల్డ్‌మన్ సాచ్స్ ఔన్సుకు 5,000 డారల్లు, స్విస్ ఆసియా 2032 నాటికి ఔన్సుకు 8,000–12,000 డాలర్లుగా అంచనా వేస్తున్నాయి. క్యాపిటల్ లీగ్ భాగస్వామి రాజుల్ కొఠారి బంగారం ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని అన్నారు.

భౌగోళిక రాజకీయ లేదా ద్రవ్యోల్బణ ఆందోళనలు తీవ్రమైతే ఔన్సుకు 3,700–3,800 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే స్వల్పకాలిక సాంకేతిక నిపుణులు మాత్రం భిన్నంగా చెబుతున్నారు. 2–5 శాతం ధర తగ్గే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. ధరలను తాత్కాలికంగా ఔన్సుకు 3,500–3,600 పరిధిలోకి వస్తాయని అన్నారు. రిటైల్ పెట్టుబడిదారుల కోసం కొనుగోలు వ్యూహం నిపుణులు రికార్డు గరిష్ట స్థాయిలలో ఒకేసారి కొనుగోళ్లు చేయడం కంటే అస్థిరమైన కొనుగోలు వ్యూహాన్ని సిఫార్సు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి