AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..

బంగారం ధరలు గత ఏడాది కాలంలో సుమారు 60శాతం పెరిగి రూ. 1,30,000 మార్కును దాటాయి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అయితే గత 3,4 రోజులుగా బంగారం తగ్గుతూ వస్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు స్వల్పంగా గ్గాయి. తెలుగు రాష్ట్రాలు సహా ప్రధాన పట్టణాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
Gold Price Down Slightly
Krishna S
|

Updated on: Oct 25, 2025 | 9:06 AM

Share

భారతీయులకు బంగారం అంటేనే స్పెషల్ సెంటిమెంట్. వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అయితే బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ సామాన్యులను, ముఖ్యంగా మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పసిడి ధరల భగభగతో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఏడాది కిందట సుమారు రూ. 70,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం ఏకంగా రూ. 1,30,000 మార్కును దాటింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో బంగారం ధర 60శాతం పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అభద్రత కారణంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,360గా ఉంది. నిన్న ఇది రూ.1,24,370గా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి స్వల్పంగా అంటే రూ.10రూపాయలు తగ్గింది.

హైదరాబాద్‌లో

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,24,360గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,13,990 ఉండగా.. నిన్న రూ.1,14,000గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం స్వల్పంగా రూ.10రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.93,270గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,24,360గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,990గా ఉండగా.. నిన్న 1,14,000గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,24,360 ఉంది. ఈ ధర నిన్న రూ.1,24,370గా ఉండేది. అంటే రూ.10 పెరిగింది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,360గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,990గా ఉంది.

గత నాలుగు రోజులుగా

కాగా గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నెల 20న 10 గ్రాముల బంగారం ధర రూ.1,30, 690గా ఉంది. 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర 1,19,800గా ఉంది. ఇక ఈ నెల 21 10గ్రాముల బంగారం ధర రూ.1,30,580గా ఉంది. ఈ నెల 22న బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,25,890గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర. 1,15,400గా ఉంది. ఇక ఈ నెల 23న 10గ్రాముల బంగారం ధర రూ.1,25,080గా ఉంది. అదే 22క్యారెట్ల గోల్డ్ ధర 1,14,650గా ఉంది.

వెండి ధరలు

ఇక వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్‌లో తులం వెండి రూ.1699గా ఉంది. ఇక కిలో వెండి రూ.1,69,900గా ఉంది. ఇది నిన్నటికి ఇవాళ్టికి రూ.100 తగ్గింది. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1699గా ఉండగా.. కిలో వెండి రూ.1,69,900గా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..