Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధర ఎలా ఉందంటే..
Gold Price Today: భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు, రూపాయి విలువ, ప్రభుత్వం విధించే పన్నులు వంటి అనేక అంశాల ద్వారా నిర్ణయించబడతాయి. మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, సంప్రదాయం, పండుగలతో కూడా ముడిపడి ఉంటుంది..

దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. భాతీరయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా జూన్ 10వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు ఉంది. తులం బంగారం ధరపై అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,540 రూపాయల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Brain Tumour: నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు కనిపిస్తు బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు!
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,830 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,690 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. బంగారం ధర తగ్గితే వెండి పెరుగుతోంది. కిలో వెండి ధర లక్షా 8 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Jio: మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న అంబానీ.. జియో సర్‌ప్రైజ్‌తో మార్కెట్ షేక్!
భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు, రూపాయి విలువ, ప్రభుత్వం విధించే పన్నులు వంటి అనేక అంశాల ద్వారా నిర్ణయించబడతాయి. మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, సంప్రదాయం, పండుగలతో కూడా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పండుగ సీజన్లలో దాని డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా ధరలు కూడా పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: Air Conditioner: మీరు ఇలా చేస్తే ఏసీ విద్యుత్ బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. కేంద్రం కీలక సూచన
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి