Gold and Silver Price: శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దేశంలో ఈ రోజు (శుక్రవారం) కూడా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేవిధంగా పసిడి ధర దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధర కొంతమేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
భారతీయులకు బంగారం అలవికాని ఇష్టం.. ఇంకా చెప్పాలంటే బంగారం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. తమకు ఎప్పుడైనా ఆర్ధిక ఇబ్బంది కలిగితే అదుకునేది బంగారం అని భావిస్తారు. కరోనా తర్వాత బంగారం అంటే పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు ముదుపరులు. దీంతో ఓ వైపు బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకుంది. అయితే అప్పటి నుంచి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దేశంలో ఈ రోజు (శుక్రవారం) కూడా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేవిధంగా పసిడి ధర దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధర కొంతమేర తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర రూ. 250 లు తగ్గి.. రూ.54,700లు గా కొనసాగుతుంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ ల్లో కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 280 లు తగ్గి నేడు రూ. 59,670 వద్ద కొనసాగుతుంది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850లతో కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,820లు ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050ల వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050లు ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700లతోనూ .. 24 క్యారెట్ల పసిడి రూ. 59,670ల వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,670 వద్ద కొనసాగుతుంది.
దేశంలో వెండి ధరలు..
బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు ఆసక్తి చూపించే లోహం వెండి. ఒకప్పుడు పూజ సామాగ్రి, దేవుడి విగ్రహాలతో పాటు కాళ్ల పట్టీలు వంటి వాటికీ మాత్రమే ఉపయోగించే వెండి.. ఇప్పుడు మారుతున్నా కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా వెండితో కూడా అందమైన నగలు తయారు చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు వస్తే చాలు.. వెండి వస్తువులను గిఫ్ట్ గా ఇస్తారు. ఈ నేపథ్యంలో దేశంలో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
ఈ రోజు కూడా వెండి ధర కొంతమేర తగ్గింది. కేజీ వెండి రూ. 500 లు తగ్గి.. రూ. 73, 000 లు ఉంది. అయితే భాగ్యనగరంలో కేజీ వెండి రూ. 500 లు తగ్గి.. రూ. 76,200లుగా కొనసాగుతుంది. ఇవే ధరలు విశాఖ, విజయవాడలో కూడా కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..