Go First: గో ఫస్ట్ విమానాలు జూలై 16 వరకు రద్దు.. రీఫండ్ ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గో ఫస్ట్ విమాన సర్వీసు ఇప్పుడు జూలై 16 వరకు రద్దు అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు ఎయిర్‌లైన్ వినియోగదారుల కోసం ప్రకటన జారీ చేసింది. ఆర్థికపరంగా పరిస్థితులు అనుకూలించని కారణంగా గోఫస్ట్ ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి తన విమానాలను రద్దు చేసింది. ఈ విధంగా చూస్తే..
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గో ఫస్ట్ విమాన సర్వీసు ఇప్పుడు జూలై 16 వరకు రద్దు అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు ఎయిర్‌లైన్ వినియోగదారుల కోసం ప్రకటన జారీ చేసింది. ఆర్థికపరంగా పరిస్థితులు అనుకూలించని కారణంగా గోఫస్ట్ ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి తన విమానాలను రద్దు చేసింది. ఈ విధంగా చూస్తే, GoFirst విమానాలు 2 నెలల 10 రోజుల పాటు రద్దు కొనసాగనుంది. గో ఫస్ట్ ఒక ట్వీట్ ద్వారా సమాచారం ఇస్తూ, ‘ఆపరేషనల్ కారణాల వల్ల గో ఫస్ట్ విమానాలు జూలై 16 వరకు రద్దు చేయబడ్డాయి. కస్టమర్‌లకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఏదైనా వివరాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అంటూ ట్వీట్ చేసింది.
Due to operational reasons, Go First flights until 16th July 2023 are cancelled. We apologise for the inconvenience caused and request customers to visit https://t.co/FdMt1cRR4b for more information. For any queries or concerns, please feel free to contact us. pic.twitter.com/cD8JLYW6hJ
— GO FIRST (@GoFirstairways) July 13, 2023
రీఫండ్ పొందడానికి కస్టమర్‌లు ఏమి చేయాలి?
కస్టమర్లు తమ బుకింగ్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయాలనుకుంటే ఎయిర్‌లైన్ అధికారిక పాలసీని చూడాలని కంపెనీ తెలిపింది. విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయని తాము అంగీకరిస్తున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. అందుకే మా పూర్తి సహాయం అందిస్తామని తాము వినియోగదారులకు హామీ ఇస్తున్నామని తెలిపింది. కస్టమర్‌లు ఏదైనా సహాయం కోసం కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ 1800 2100 999కి కాల్ చేయాలి. లేదా feedback@flygofirst.com మెయిల్ ఐడికి సందేశం పంపండి. తద్వారా మేము మీకు సహాయం చేస్తాము. విమానయాన సంస్థ కూడా ‘మీ అందరికీ తెలిసినట్లుగా, కంపెనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఎయిర్‌లైన్ దరఖాస్తును దాఖలు చేసింది. త్వరలో విమానాల బుకింగ్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాము. మీ సహనానికి ధన్యవాదాలు.. అంటూ కంపెనీ ట్వీట్ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి