Youtube Videos: యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ సంస్థలపై సెబీ చర్యలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లోని పలు ఛానెల్‌లలో తప్పుదోవ పట్టించే వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ షేర్ ధరను తారుమారు చేసినందుకు తొమ్మిది సంస్థలపై విధించిన పరిమితులను ఎత్తివేయడానికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ (సెబి) నిరాకరించింది. ఈ విషయంపై ప్రాథమిక..

Youtube Videos: యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ సంస్థలపై సెబీ చర్యలు
Stock Market
Follow us
Subhash Goud

|

Updated on: Jul 13, 2023 | 3:42 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌లోని పలు ఛానెల్‌లలో తప్పుదోవ పట్టించే వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ షేర్ ధరను తారుమారు చేసినందుకు తొమ్మిది సంస్థలపై విధించిన పరిమితులను ఎత్తివేయడానికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ (సెబి) నిరాకరించింది. ఈ విషయంపై ప్రాథమిక విచారణ ఆధారంగా మార్చిలో సెబీ 24 కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. వీటిలో తొమ్మిది కంపెనీలపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ధృవీకరించింది. ఈ సంస్థలు ఫ్రాడ్ అండ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ (పిఎఫ్‌యుటిపి) నిబంధనల ప్రకారం ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఈ మధ్యంతర ఉత్తర్వు ధృవీకరించబడిందని సెబి ఒక ఆర్డర్‌లో తెలిపింది. ఈ క్రమంలో జతిన్ మనుభాయ్ షా, అంగద్ ఎం రాథోడ్, హేలీ జతిన్ షా, దైవిక్ జతిన్ షా, అశోక్ కుమార్ అగర్వాల్, అన్షు అగర్వాల్, అన్షుల్ అగర్వాల్, హేమంత్ దుసాద్, అన్షుల్ అగర్వాల్ కంపెనీ హెచ్‌యూఎఫ్‌లపై నిషేధం కొనసాగుతోంది.

మే, 2022 రెండవ పక్షం రోజుల్లో షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ షేర్లకు సంబంధించి యూట్యూబ్‌లో కొన్ని తప్పుదారి పట్టించే వీడియోలు పోస్ట్ అయినట్లు SEBI తన పరిశోధనలో కనుగొంది. ఈ వీడియోలో ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడిదారులకు సూచించారు.

ఈ స్కామ్‌కు పాల్పడినవారు మొదట స్టాక్ ధరను పెంచి, ఫేక్ టిప్‌లు ఇచ్చి పెట్టుబడిదారులను కొనుగోలు చేసేలా ఒప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టెలిగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ షేర్లను కొనుగోలు చేయాలని వారు సిఫార్సు చేస్తున్నారు. వారే కొంత కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. తద్వారా స్టాక్ కొద్దిగా పెరుగుతుంది. ఈ పథకాల గురించి తెలియక, సాధారణ పెట్టుబడిదారులు నిరంతర వృద్ధిని చూసి స్టాక్‌లలో డబ్బును పెట్టుబడి పెడతారు. దీని కారణంగా షేరు ధర అనేక రెట్లు పెరుగుతుంది. ఈ దుండగులు ఇప్పటికే తక్కువ ధరకు షేర్లను కొనుగోలు చేసి, లాభాలను బుక్ చేసుకుని వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో స్టాక్ అమ్మకాల కారణంగా, స్టాక్ ధర తారుమారు అవుతుంది. దీని వల్ల సాధారణ పెట్టుబడిదారుడికి చాలా నష్టం వాటిల్లుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి