- Telugu News Photo Gallery Bengaluru Set For Chip Enabled e Passport Implemented As Part of New Version
e-Passport: చిప్‌తో కూడిన ఇ-పాస్‌పోర్ట్.. కేవలం రెండు రోజుల్లోనే జారీ
పాస్‌పోర్ట్ సేవాలో త్వరలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాస్‌పోర్ట్ సేవా ప్రణాళికలో భాగంగా, చిప్ - లింక్డ్ ఇ - పాస్‌పోర్ట్ పాస్‌పోర్ట్ జారీ సమయాన్ని సగానికి తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం..
Updated on: Jul 12, 2023 | 4:17 PM

పాస్‌పోర్ట్ సేవాలో త్వరలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాస్‌పోర్ట్ సేవా ప్రణాళికలో భాగంగా, చిప్ - లింక్డ్ ఇ - పాస్‌పోర్ట్ పాస్‌పోర్ట్ జారీ సమయాన్ని సగానికి తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. కొత్త పాస్‌పోర్ట్ సేవా పథకం తొలి ట్రయల్ బెంగళూరులో జరుగుతోంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాంకేతికంగా అభివృద్ధి చేసిన కొత్త పాస్‌పోర్ట్ సేవా పథకం బెంగళూరులోని రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో అమలు అమవుతోంది. ఈ రెండు కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ తదితరాలు మారుతున్నాయి. ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కొత్త వెర్షన్ ఈ నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

15 ఏళ్ల క్రితం పాస్‌పోర్టు కావాలంటే నెలల సమయం పట్టేది. ఆ తర్వాత క్రమంగా పాస్‌పోర్టు జారీ చేసే విధానం సులభతరం చేయబడింది. ప్రస్తుతం పాస్‌పోర్ట్ నాలుగైదు పనిదినాల్లో లభిస్తుంది. ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ సేవా పథకం అమలవుతోంది అయితే రెండు మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు పొందవచ్చు.

పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం 2012 లో అమలు చేయబడింది. అయితే అంతకు ముందు 2010 మేలో బెంగుళూరు, చండీగఢ్‌లలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది. అక్కడ విజయం సాధించిన తర్వాత ఇది 2012 లో దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా యోజన రెండవ ఎడిషన్ పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో మొదటగా నిర్వహించబడుతుంది. బెంగళూరులో రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. లాల్‌బాగ్ రోడ్‌లో ఒకటి, మరతహళ్లిలో మరొకటి ఉంది. లాల్‌బాగ్ రోడ్‌లోని పాస్‌పోర్ట్ సెంటర్‌లో 1,700 దరఖాస్తులు వచ్చాయి. మారతహళ్లిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో 900 దరఖాస్తులు వచ్చాయి.

బెంగళూరులో విజయవంతమైన ట్రయల్ తర్వాత, కొత్త పాస్‌పోర్ట్ సేవా పథకం దేశవ్యాప్తంగా అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తున్నారు. 2014 లో భారతదేశంలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు 9 ఏళ్లలో ఏడు రెట్లు పెరిగి 523 సేవా కేంద్రాలు ఉన్నాయి.





























