- Telugu News Photo Gallery Cricket photos Lahore and kandy may host asia cup 2023 matches check ind vs pak match details
IND vs PAK, Asia Cup 2023: ఆసియా కప్ మ్యాచ్‌లు జరిగే వేదికలు ఇవే.. భారత్-పాకిస్తాన్ పోరు ఎక్కడంటే?
Asia Cup Venue: తాజాగా పాకిస్థాన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీమిండియా పాకిస్థాన్‌లో ఆడాల్సిందేనని పాక్ క్రికెట్ బోర్డు కొత్తగా పట్టుబడుతోంది. ఆసియా కప్‌నకు ఆతిథ్యమిచ్చే దేశం పాకిస్థాన్ కాబట్టి, టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరగాలని పీసీబీ వాదిస్తోంది.
Updated on: Jul 12, 2023 | 4:49 PM

IND vs PAK, Asia Cup 2023: ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడంలో బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను సూచించింది. ఈ నమూనా ప్రకారం, పాకిస్తాన్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేది. అయితే భారత జట్టు మాత్రం తటస్థ వేదికలపై ఆడనుంది.

తాజాగా పాకిస్థాన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. టీమిండియా పాకిస్థాన్‌లో ఆడాల్సిందేనని పాక్ క్రికెట్ బోర్డు కొత్తగా పట్టుబడుతోంది. ఆసియా కప్‌నకు ఆతిథ్యమిచ్చే దేశం పాకిస్థాన్ కాబట్టి, టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనే జరగాలని పీసీబీ వాదిస్తోంది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, శ్రీలంకలోని క్యాండీలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తమ మ్యాచ్‌లను క్యాండీలో ఆడనుంది. దీంతో పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్యాండీలో జరగనుంది.

ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక 7 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.

కాగా, ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పాకిస్తాన్ క్రీడా మంత్రి అహ్సాన్ మజారీ మాట్లాడుతూ.. ఆసియా కప్ 2023కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నందున, టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్ గడ్డపై ఆడాలని అన్నారు. తనకు హైబ్రిడ్ మోడల్ అక్కర్లేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే, పాకిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు వెళ్లదంటూ ప్రకటించాడు.




