- Telugu News Photo Gallery Cricket photos Yashasvi Jaiswal: Highest avg in First Class Cricket at the time of India Test debut check full list vinod kambli
Yashasvi Jaiswal: అద్భుత రికార్డ్‌తో అరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్.. ఆ లిస్టులో మూడో భారత ప్లేయర్..
India vs West Indies 1st Test: యశస్వీ జైస్వాల్ 15 మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌లు ఆడి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మొత్తం 1845 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 9 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
Updated on: Jul 12, 2023 | 9:08 PM

India vs West Indies 1st: డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ఇషాన్ కిషన్ (Ishan Kishan) టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశారు . ఈ అరంగేట్రంతో జైస్వాల్ ప్రత్యేక రికార్డు సృష్టించడం విశేషం.

యశస్వీ జైస్వాల్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సగటుతో భారత్ తరపున అరంగేట్రం చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఉన్నాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 27 మ్యాచ్‌ల్లో 88.37 సగటుతో పరుగులు చేయడంతో కాంబ్లీ టీం ఇండియాలోకి ప్రవేశించాడు. అదేవిధంగా ప్రవీణ్ అమ్రే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 23 మ్యాచ్‌లలో 81.23 సగటుతో భారత్‌కు అరంగేట్రం చేశాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచ్‌ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌కు భారత జట్టులో అవకాశం లభించింది. దీంతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సగటుతో టీమిండియాకు అరంగేట్రం చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 26 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వీ జైస్వాల్ మొత్తం 1845 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. జైస్వాల్ 26 ఇన్నింగ్స్‌ల్లో 227 ఫోర్లు, 24 సిక్సర్లు బాదాడు. అంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్.. టీమిండియాకు అండగా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.




