Spinal Cord Pain: ఈ లక్షణాలతో వెన్నునొప్పి వస్తుందా.. వెంటనే వైద్యులను సంప్రదించండి..

వెన్నునొప్పి కలగటానికి ముఖ్యంగా చాలాకాలంగా కొనసాగిస్తున్న నష్టదాయకమైన అలవాట్లు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్య నిపుణులు. కంప్యూటర్ పైన నిరంతరం వంగి పని చేయడం కూడా కారణం కావచ్చు. దీనినే టెక్ నెక్ అని కూడా పిలుస్తున్నారు. మిగతా కారణాలలో ప్రమాదాలు, కండరాలు అలసి దెబ్బదినటం, క్రీడలలో పాల్గొన్నప్పుడు తగిలిన గాయాల వల్ల వెన్ను నొప్పి బారిన పడతారు.

Prudvi Battula

|

Updated on: Jul 12, 2023 | 4:14 PM

1 / 6
సాధారణంగా వెన్ను నొప్పి రోజంతా ఉంటుంది. పగలంతా మామూలుగానే ఉన్నా రాత్రిళ్లు తీవ్రమైన వెన్ను నొప్పితో పడుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మెడ కింది భాగం నుంచి వెన్నుచివరన ఉండే టెయిల్ బోన్ దాకా వెన్ను వెంట బిగసుకుపోయినట్లు అనిపించడం.

2 / 6
ఎంతకూ ఉపశమనం లేకుండా నొప్పిఉండటం, మెడలో, వీపు పైభాగంలో, వీపు కింది భాగంలో చాలా నొప్పిగా ఉండటం,. ఏదైనా బరువు ఎత్తినపుడు, శ్రమతో కూడిన పనులేమైనా చేసినపుడు నొప్పి మరింత ఎక్కువ అనిపించటం. ఎక్కువ సేపు కూర్చున్నా, నిలబడ్డా వీపు మధ్య, కింది భాగాలలో నొప్పి, వీపు కింది భాగం నుంచి పిరుదులు, తొడలు, పిక్కలు, వేళ్ల వరకూ నొప్పి ఉండటం వెన్నుముక నొప్పి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

3 / 6
ఆధునిక కాలంలో అందరికీ వెన్నునొప్పి ఎదురవుతూనే ఉంటుంది. ఈ నొప్పి కొందరికి తక్కువగా ఉంటే, కొందరికి ఎక్కువుగా ఉంటుంది. వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవటంతో వెన్ను నొప్పి మొదలవుతుంది.

4 / 6
వీపు కింది భాగంలో ఉండే అనేక కండరాలు, లిగమెంట్స్ వెన్నుపూనలకు అతుక్కుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలో నిలబెట్టి ఉంచుతుంటాయి. మనం కూర్చుని, నిలబడి పనులు చేసే సమయంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేట్లు చేస్తాం. ఫలితంగా వాటిపై ఒత్తిడి పెరిగి, వెన్నునొప్పికి దారితీస్తుంది.

5 / 6
కొంత మందిలో సాధారణమైన అలవాట్ల కారణంగా చిన్న వయస్సు నుంచే ఈ కండరాల పైన నిరంతరం ఒత్తిడి కొనసాగుతుంది. శ్రమతో కూడిన పని చేయటం ద్వారా కలిగే నొప్పి తాత్కాలికమే అయినా, ఈ అలవాటు నిరంతరం కొనసాగితే కండరాలు బాగా అలసిపోతాయి, బలహీనపడతాయి. దీంతో అవి వెన్నును సరైన ప్రదేశంలో నిలిపి ఉంచలేకపోతాయి. ఈ రకంగా వెన్ను నొప్పి మొదలవుతుంది.

6 / 6
Follow us