AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Cars: ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకూ అవకాశం

మారుతీ సుజుకీ మన దేశీయ మార్కెట్లో కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. మారుతి సుజుకీ జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ. 2.3 లక్షల వరకూ తగ్గింపును అందిస్తోంది. వీటిల్లో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, క్యాష్ బ్యాక్ ల రూపంలో అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Maruti Suzuki Cars: ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకూ అవకాశం
Jimny Thunder
Madhu
| Edited By: |

Updated on: Dec 09, 2023 | 10:23 PM

Share

సంవత్సరాంతపు రోజుల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో చాలా కంపెనీలు క్లియరింగ్ సేల్స్, ఇయర్ ఎండింగ్ సేల్స్ నిర్వహిస్తాయి. వాటిల్లో భారీ డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలు అందిస్తాయి. ఇదే క్రమంలో ఈ డిసెంబర్లో మారుతీ సుజుకీ మన దేశీయ మార్కెట్లో కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. మారుతి సుజుకీ జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ. 2.3 లక్షల వరకూ తగ్గింపును అందిస్తోంది. వీటిల్లో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, క్యాష్ బ్యాక్ ల రూపంలో అందిస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ కార్లపై ఉన్న ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మారుతి సుజుకీ జిమ్నీ..

ఈ కారుపై రూ. 2.3 లక్షల వరకూ డిస్కౌంట్ ను పొందొచ్చు. ఈ కారు లేటెస్ట్ ఎడిషన్ జిమ్నీ థండర్ ను ఇటీవలే రూ. 10.74లక్షల(ఎక్స్ షోరూం) ధరతో మార్కెట్లో విడుదల చేసింది. కాగా ఎంట్రీ లెవెల్ వేరియంట్ మారుతి సుజుకీ జిమ్నీ జెటాను ఈ డిసెంబర్ లో నెలలో కొనుగోలు చేస్తే రూ. 2.3లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. ఈ నెలలో వినియోగదారులు ఆల్ఫా, జెట్ వేరియంట్లపై కూడా రూ. 2లక్షల వరకూ తగ్గింపును పొందొచ్చు.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..

ఈ కారుపై రూ. 40,000 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫ్రాంక్స్ కారు అత్యంత జనాదరణ పొందిన మోడల్. ఇది ప్రారంభించినప్పటి నుంచి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సా కార్లలో ఇదీ ఒకటి. ఇది పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి కొనుగోలుపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ గ్రాండ్ విటారా..

ఈ కారు కొనుగోలుపై రూ. 35,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ డిసెంబర్ నెలలో రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకూ పలు డిస్కౌంట్లు పొందుకోవచ్చు. గ్రాండ్ విటారా హై బ్రీడ్ వేరియంట్ పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

జనవరిలో రేట్లు పెరుగుతాయ్..

కాగా మారుతి సుజుకీ మరో ఆసక్తి కరమైన ప్రకటన చేసింది. అదేంటంటే 2024 జనవరి నుంచి అన్ని కార్ల రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంత మేర పెరుగుతుంది అనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో మీరు కనుక కారు కొనే ఆలోచనలో ఉంటే ఈ నెలలోనే కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రస్తుతం తక్కువ ధరతో పాటు ఆఫర్లు కూడా ఉన్నాయి. జనవరి నుంచి ఆఫర్లు ఉండవు.. అలాగే ధరలు కూడా పెరుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..