Business Idea: జస్ట్ పది బస్తాలు తెచ్చుకొని లోకల్ మార్కెట్లో అమ్ముకుంటే చాలు.. నెలకు రూ. 1 లక్ష వెనకేసుకునే అవకాశం.

ఏదైనా వ్యాపారం చేయాలన్న ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మీకో చక్కటి బిజినెస్ ప్లాన్ ఐడియా అందిస్తాం.

Business Idea: జస్ట్ పది బస్తాలు తెచ్చుకొని లోకల్ మార్కెట్లో అమ్ముకుంటే చాలు.. నెలకు రూ. 1 లక్ష వెనకేసుకునే అవకాశం.
Money
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 09, 2023 | 6:35 PM

ఏదైనా వ్యాపారం చేయాలన్న ప్లాన్ చేస్తున్నారా? ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మీకో చక్కటి బిజినెస్ ప్లాన్ ఐడియా అందిస్తాం. ఇప్పటివరకు కొద్దిమందికి మాత్రమే ఈ బిజినెస్ పరిచయం. వారు అందులో చక్కల లాభాలను పొందుతున్నారు. ఈ వ్యాపారానికి చదవుతో అస్సలు సంబంధం లేదు. కేవలం తెలివితేటలు ఉంటే చాలు. వ్యాపారంలో ఉండాల్సిన మెళకవలు నేర్చుకుంటే ఇంకా మంచిది. చక్కటి ఆదాయం పొందవచ్చు. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకుందామా.

భారతీయ వంటకాల్లో వెల్లుల్లి లేనిది ఉండవు. చాలా తక్కువ వంటల్లో మాత్రమే వెల్లుల్లిని ఉపయోగించరు. కూరగాయల నుంచి మాంసాహారం వరకు ప్రతి వంటకంలో వెల్లుల్లి ఉండాల్సిందే. వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అంతాఇంతాకావు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా వెల్లుల్లి కాపాడుతుంది. వెల్లుల్లి రసం చెడు కొలెస్ట్రాల్ ను నిరోధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే మన పెద్దలు వెల్లుల్లిని తినాలని చెబుతుంటారు. అయితే వెల్లుల్లిని ఒక వ్యాపారంగా మలచుకుంటే…ఆదాయం పొందవచ్చు. హోల్ సేల్ వ్యాపారం చేయడం ద్వారా మంచి లాభాలను గడించవచ్చు. అయితే ఈ వ్యాపారంలో కావాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లి అత్యధికంగా చైనాలో పండిస్తారు. మన దేశంలో కూడా వెల్లుల్లి వాడకం ఎక్కువ కానీ…మనం దేశంలో వెల్లుల్లి పండించే శాతం తక్కువ. రాజస్తాన్ వెల్లుల్లి ఉత్పత్తిలో మొదటిస్థానంలో ఉంది. మనదేశంలో ఉత్పత్తి అయ్యే వెల్లుల్లిలో దాదాపు 70శాతం రాజస్థాన్ లోనే పండిస్తారు. ఆ తర్వాత గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వెల్లుల్లిని సాగుచేస్తారు.

ఇవి కూడా చదవండి

మీరు వెల్లుల్లి వ్యాపారాన్ని ప్రారంభించి హోల్ సేల్ గా మండీల్లో కొనుగోలు చేసి.. రిటైల్‎గా కిరాణా షాపులకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా గ్రేడింగ్ పద్ధతిలో దీన్ని విభజిస్తారు. 55 ఎంఎం వెల్లుల్లి ధర ఒక కేజీ 150 వరకు పలుకుతుంది. దీన్ని ఎక్స్పోర్ట్ సైతం చేస్తారు. 25 ఎంఎం, 35, ఎంఎం 30ఎంఎం, 45ఎంఎం, 50-55 ఎంఎం, 65ఎంఎం సైజుల్లో వెల్లుల్లి అందుబాటులో ఉంటుంది. 20 నుంచి 30 ఎంఎం వెల్లుల్లి ధర 100 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలుకుతుంది. ఉదాహరణకు మనకు మార్కెట్లో లభించే వెల్లుల్లి ఒక కేజీ సుమారు 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటుంది. కానీ మనకు 100 రూపాయలకు కేజీ చొప్పున విక్రయిస్తారు. దాదాపు రెండు నుంచి మూడింతలు లాభం ఇందులో ఉంటుంది.

రాజస్థాన్ కోటాలో వెల్లుల్లి హోల్‎సేల్‎‎గా లభిస్తుంది. వెల్లుల్లిని క్వింటాల రూపంలో కొనుగోలు చేసుకోని… మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులను కూడా బేరీజు వేసుకొని, రిటైల్ గా మీరు ఎంతకు విక్రయిస్తే లాభం వస్తుందో ఒక సారి చూసుకోవాలి. అప్పుడు మీరు కిరాణా షాపులకు వెల్లుల్లిని సప్లై చేస్తే మంచి లాభం ఉంటుంది.

ఒక కేజీ రూ.30 చొప్పున 100 కేజీల బస్తా కొంటే, రూ.3000 అవుతుంది. దాన్ని కేజీ రూ. 100 చొప్పున రిటైల్ మార్కెట్లో విక్రయించండి. బస్తాపై రూ.7000 లాభం వస్తుంది. ఈ లెక్కన చూస్తే 10 బస్తాలపై 70 వేల వరకూ లాభాన్ని పొందవచ్చు. నెలకు 10 బస్తాలు విక్రయించినా చాలు, ఏడాదికి కనీసం రూ. 8 నుంచి రూ. 10 లక్షలు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం