ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సరకు రవాణాలో వినూత్న ( టారీఫ్, నాన్ టారిఫ్ పరంగా ) చర్యల ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది. సరుకు రవాణాను సులభంగా, వేగవంతంగా చేయడానికి సరకు రవాణా టెర్మినల్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనితో పాటు సరకు రవాణా సజావుగా సాగేందుకు ముఖ్యమైన గూడ్స్ షెడ్‌ల వద్ద మెరుగైన స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి .