Ola Electric Scooters: ఓలా స్కూటర్లపై అద్భుతమైన డిస్కౌంట్స్.. సర్వీస్ ప్లాన్స్‌లో కూడా గణనీయమైన తగ్గింపు.. ఇక వారికి పండగే
ఓలా ఎస్1 ప్రోపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఈ స్కూటర్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.12000 తగ్గింపును అందిస్తున్న కంపెనీ తాజాగా రూ.4000 ఎక్స్‌ట్రా తగ్గింపును ఆఫర్ చేస్తుంది.

భారతీయ మార్కెట్‌లో ఈవీ విభాగంలో ఓలా కంపెనీ తన స్కూటర్లతో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇండియాలో సెల్ అయ్యే ఈవీ స్కూటర్లలో ఓలా ఎప్పుడూ తన మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ముఖ్యంగా వినియోగదారులకు వివిధ ఆఫర్లను ఇస్తూ తన సేల్స్‌లో అగ్రగామిగా ఉంటుంది. అయితే ఇటీవల హోలీ, మహిళా దినోత్సవాన్ని నేపథ్యంలో భారీ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. తన మోడల్స్‌లోని ఎస్1 ప్రోపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఈ స్కూటర్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.12000 తగ్గింపును అందిస్తున్న కంపెనీ తాజాగా రూ.4000 ఎక్స్‌ట్రా తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1.17 లక్షలుగా ఉంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే వేరియంట్‌పై మాత్రమే వస్తుంది. 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే స్కూటర్లపై రూ.2000 ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వస్తుంది. అలాగే ఓ కస్టమర్ పాయింట్ల వద్ద రూ.7000 విలువైన ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే 50 శాతం రాయితీ ఎక్స్‌టెండెడ్ వారెంటీతో పాటు ఓలా కేర్ సబ్స్‌స్క్రిప్షన్లు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఓలా కేర్ సబ్స్‌స్క్రిప్షన్ ప్లాన్లతో వచ్చే ఇతర వివరాలేంటో ఓ సారి చూద్దాం.
ఓలా కేర్ సబ్స్‌స్క్రిప్షన్‌లో లభించేవి ఇవే
ఓలా కంపెనీ రూ.1999, రూ.2999 ధరల్లో రెండు రకాల ఓలా కేర్ సబ్స్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. ఉచిత లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, పంక్చర్ అసిస్టెన్స్ ఉన్నాయి. అలాగే ఓలా కేర్ ప్లస్‌లో ఓలా కేర్ ప్రయోజనాలతో పాటు ప్లాబ్లమ్ ఫైండింగ్ సర్వీస్, పిక్ అప్/డ్రాప్‌తో పాటు 24/7 డాక్టర్, అంబులెన్స్ సర్వీస్‌లను కూడా అందిస్తుంది.



మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం
