Gautam Adani: మరోసారి 100బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన గౌతమ్ ఆదానీ
ఏడాది కిందట వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ నికర విలువ 100 బిలియన్ డాలర్లు దాటడం ఇదే మొదటి సారి. అయితే గత ఏడాది జనవరి నాటికి అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అతను ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. అదే సమయంలో హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర నష్టాలను కలిగించింది..

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ ఆస్తి పెరిగిపోతోంది. 2023 యూఎస్ ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ తన సంపదను పెంచుకున్నారు. ఇప్పుడు రూ.100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయారు. బ్లూమ్‌బెర్గ్ వార్త సంస్థ ప్రకారం.. ఆదానీ నికర విలువ బుధవారం 100.7 బిలయన్ల డార్లకు పెరిగింది. అతను ప్రపంచంలోని 12వ ధనవంతుడు. ఆదానీ ఈ ఏడాది 16.4 బిలియన్ డార్లను తిరిగి పొందినట్లు వార్త సంస్థ తెలిపింది. ఏడాది కిందట వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ నికర విలువ 100 బిలియన్ డాలర్లు దాటడం ఇదే మొదటి సారి. అయితే గత ఏడాది జనవరి నాటికి అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అతను ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. అదే సమయంలో హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర నష్టాలను కలిగించింది.
మరోవైపు.. గౌమత్ అదానీ సంపద ఇటీవల భారీగా పెరిగిన క్రమంలో ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ 12వ స్థానానికి చేరుకున్నారు. మార్కెట్ మానిప్యులేషన్, మోసం ఆరోపణల తర్వాత అదానీ సంపద $80 బిలియన్లకు పైగా క్షీణించింది. కానీ ఆ తర్వాత పుంజుకుంది. ఒక దశలో $150 బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కోల్పోయిన అతను పెట్టుబడిదారులను, రుణదాతలను వెనక్కి తిప్పికొట్టడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి, నియంత్రణ సమస్యలను తగ్గించుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ కంటే ఒక స్థానం వెనుకబడి ఉన్నాడు. అంబానీ ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో 111.4 బిలియన్ డాలర్లు నికర విలువతో 11వ స్థానంలో ఉండగా, బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌లో అతని నికర విలువ 107 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో భారత సుప్రీం కోర్ట్ మూడు నెలల్లోగా గ్రూప్‌పై దర్యాప్తును ముగించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




