AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్ అని తీసిపారేయకండి.. ఇది మినీ ఏసీ భయ్యో.. క్షణాల్లో ఇల్లంతా చల్ల.. చల్లగా! ధర తెలిస్తే..

వేసవికాలం ఇలా వచ్చిందో.. లేదో.. భానుడి భగభగలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు అతుక్కుపోతున్నారు. ఫ్యాన్లు అయితే సరే.. ఏసీలు, కూలర్లు అందరికీ అందుబాటులో ఉండవు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వ్యక్తులు..

ఫ్యాన్ అని తీసిపారేయకండి.. ఇది మినీ ఏసీ భయ్యో.. క్షణాల్లో ఇల్లంతా చల్ల.. చల్లగా! ధర తెలిస్తే..
Mini Table Fan
Ravi Kiran
|

Updated on: Apr 09, 2024 | 4:30 PM

Share

వేసవికాలం ఇలా వచ్చిందో.. లేదో.. భానుడి భగభగలకు జనాలు ఠారెత్తిపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతను తట్టుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు అతుక్కుపోతున్నారు. ఫ్యాన్లు అయితే సరే.. ఏసీలు, కూలర్లు అందరికీ అందుబాటులో ఉండవు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వ్యక్తులు ఈ ఏసీలు, కూలర్లు కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మరి అలాంటివారి కోసం పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయ్. తక్కువ ధరకే.. పర్సనల్ మినీ ఏసీల మాదిరిగా వాడుకోవచ్చు. తక్కువ ధర.. ఎక్కువ చల్లదనం.. మరి మీ ముందుకు తీసుకొచ్చిన ఓ మినీ ఏసీ ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా..

ఈ పవర్‌ఫుల్ యూఎస్‌బీ ఫ్యాన్ బ్లేడ్లు చాలా పెద్దవి. ఇందులో 5.5 అంగుళాల బ్లేడ్, 6.5 అంగుళాల ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్యాన్ గదిలో మూలల వరకు చల్లటి గాలిని చిటికెలో వ్యాపిస్తుంది. ఈ మినీ ఏసీ లాంటి ఫ్యాన్‌ను మీరు మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో లేదా.. ప్రయాణానికి వెళ్లినప్పుడు.. దీనిని ఉపయోగించవచ్చు. అడ్జస్టబుల్ 3 విండ్ స్పీడ్స్‌తో ఈ ఫ్యాన్‌ వీచే గాలి వేగాన్ని కంట్రోల్ చేయవచ్చు. బ్యాటరీతో పన్లేదు.. దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే.. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ లేదా పవర్ బ్యాంక్.. లేదా యూఎస్‌బీ పోర్ట్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. మరోవైపు ఈ ఫ్యాన్ ఎంతటి బలమైన గాలి అందించినప్పటికీ.. 50dB శబ్దం కంటే తక్కువ వస్తుంది. దీనిని 90 డిగ్రీల వరకు వంచుకోవచ్చు. ఈ ఫ్యాన్‌ను మీరు రూ. 1000లోపే కొనవచ్చు.(Source)

గమనిక: మేము ఇచ్చింది కేవలం ప్రోడక్ట్‌కి సంబంధించిన సమాచారం మాత్రమే. సంబంధిత ఈ-కామర్స్‌ సైట్‌లో ప్రోడక్ట్ చూసి.. రివ్యూస్ నచ్చి.. అన్ని సౌకర్యవంతంగా ఉంటేనే.. కొనేందుకు ఆలోచించండి.