AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Case: చట్టం ముందు అందరూ సమానమే.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు షాకిచ్చిన హైకోర్టు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కేజ్రీవాల్‌ అరెస్టును హైకోర్టు సమర్ధించింది. అయితే తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని, చట్టం

Delhi Liquor Case: చట్టం ముందు అందరూ సమానమే.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు షాకిచ్చిన హైకోర్టు
Delhi Cm Arvind Kejriwal'
Subhash Goud
|

Updated on: Apr 09, 2024 | 4:30 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కేజ్రీవాల్‌ అరెస్టును హైకోర్టు సమర్ధించింది. అయితే తన అరెస్టు, కస్టడీని సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని, చట్టం ముందు అందరరూ సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ తిరస్కరించారు. ఈ నిర్ణయం బెయిల్‌పై కాదని, కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై నిర్ణయమని తీర్పు ఇవ్వడానికి ముందు కోర్టు స్పష్టం చేసింది. సీఎంకు, సామాన్యులకు చట్టాలు సమానమేనని కోర్టు తీర్పులో పేర్కొంది. న్యాయస్థానం చట్టం ప్రకారం పనిచేస్తుంది. విచారణ నుండి ఎవరికీ మినహాయింపు ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని కోర్టు నమ్మడం లేదని తీర్పును వెలువరిస్తూ జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ అన్నారు. చట్టాలు సీఎంకు, సామాన్యులకు సమానం. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ హస్తం ఉందని ఈడీ పేర్కొంది. గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వాంగ్మూలాన్ని మార్చి 8న ఈడీ రికార్డు చేసింది. ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్‌కు, ఈడీకి మధ్య ఉందని తీర్పునిస్తూ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య కాదు. రాజకీయాలు ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. రాజకీయ కారణాలు కోర్టును ప్రభావితం చేయవు అని అన్నారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ తీర్పును ఇస్తూ, విచారణ సమయంలో కేజ్రీవాల్ కోరుకుంటే, అతను సాక్షులను ప్రశ్నించవచ్చు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికల కారణంగానే జరిగిందన్న వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. మార్చిలో ఎన్నికలు ఉన్నాయని కేజ్రీవాల్‌కు తెలుసునని కోర్టు పేర్కొంది. పదే పదే ఫోన్ చేసిన ఆయన విచారణకు వెళ్లలేదు.. తన అరెస్టును, మార్చి 22న ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను కేజ్రీవాల్ సవాలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేజ్రీవాల్ తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ కేసు ఏప్రిల్ 3న విచారణకు వచ్చింది. ఇరు పక్షాల (ఈడీ, కేజ్రీవాల్) వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తన నిర్ణయాన్ని ఏప్రిల్ 3న రిజర్వ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి