Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: మే 23 నుంచి బెంగళూరులో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారత అధ్యక్షతన ఈ ఏడాది జీ20 సమ్మిట్‌లో భాగంగా బెంగళూరులో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ (టీఐడబ్ల్యూజీ) సమావేశం 3 రోజుల పాటు జరగనుంది. మే 23 నుంచి 25 వరకు జరిగే ఈ సమావేశంలో జీ 20 సభ్య దేశాల నుంచి వందకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు. G20 సభ్య దేశాలతో పాటు..

G20 Summit: మే 23 నుంచి బెంగళూరులో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
G20 Summit
Follow us
Subhash Goud

|

Updated on: May 19, 2023 | 10:22 PM

భారత అధ్యక్షతన ఈ ఏడాది జీ20 సమ్మిట్‌లో భాగంగా బెంగళూరులో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ (టీఐడబ్ల్యూజీ) సమావేశం 3 రోజుల పాటు జరగనుంది. మే 23 నుంచి 25 వరకు జరిగే ఈ సమావేశంలో జీ 20 సభ్య దేశాల నుంచి వందకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు. G20 సభ్య దేశాలతో పాటు, ఆహ్వానించబడిన దేశాలు, ప్రాంతీయ సమూహాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మే24 న ఈ సభను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ఏడాది భారతదేశంలో జరుగుతున్న రెండవ టీఐడబ్ల్యూజీ సమావేశం ఇది. మే 23, 24, 25 తేదీలలో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

మే 23: వ్యాపారం, సాంకేతికతపై సెమినార్ నిర్వహించబడుతుంది. రెండు ప్యానెల్ చర్చలు ఉంటాయి. వ్యాపారాన్ని మార్చే సాంకేతికత, మొత్తం అభివృద్ధిలో సాంకేతికత పాత్రపై చర్చలు జరుగుతాయి. దీని తరువాత, G20 ప్రతినిధులు బెంగళూరును సందర్శించనున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది.

మే 24: ప్రపంచ వాణిజ్య సంస్థ ( WTO ) సంస్కరణపై చర్చ జరుగుతుంది. WTO పనిలో పారదర్శకతను తీసుకురావాల్సిన అవసరంపై చర్చ జరుగనుంది.

ఇవి కూడా చదవండి

మే 25: అంతర్జాతీయ వాణిజ్యానికి అవసరమైన వివిధ పేపర్ డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌కు సంబంధించి ప్రదర్శనలు ఉంటాయి. ఎంఎస్‌ఎంఈల కోసం మెగా ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను రూపొందించడం, జీవీసీలను మ్యాపింగ్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం మొదలైన వాటి కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సంబంధించిన ప్రెజెంటేషన్‌లు ఉంటాయి.

TIWG 2023 మొదటి సమావేశం 28 నుంచి 30 మార్చి వరకు ముంబైలో జరిగింది. దానికి కొనసాగింపుగా బెంగళూరులో రెండో సమావేశం జరగనుంది. G20 సమావేశం కోసం, అనుబంధంగా ఏడాది పొడవునా దీనితో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈసారి జీ 20 సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. G20 సదస్సు సెప్టెంబర్ 9, 210 తేదీలలో న్యూఢిల్లీలో జరగనుంది. భారత్, దక్షిణాసియాలో జీ20 సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఆ సమావేశంలో వివిధ తీర్మానాలు చేసి ఎజెండాలు రూపొందించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?