Fuel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో రూ.95కి చేరువలో లీటర్ పెట్రోల్..
Fuel Price Today: పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నా.. దేశీయంగా మాత్రం..
Fuel Price Today: పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నా.. దేశీయంగా మాత్రం పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు దాటేసింది. ఇక రేపో మాపో హైదారాబాద్‌లోనూ సెంచరీ కొట్టేందుకు దూకుడుమీదున్నాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.17 ఉండగా, (శనివారం రూ.90.03), డీజిల్ రూ.81.47 వద్ద (శనివారం రూ.81.32 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇంధన ధరల మంటలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 97.57 ఉండగా (శనివారం రూ.97.34), లీటర్ డీజిల్ ధర రూ.88.60గా (శనివారం రూ.88.44) ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 గా ఉండగా (శనివారం రూ.94.54), డీజిల్ ధర రూ.88.86 (శనివారం రూ.88.69 ) వద్ద కొనసాగుతోంది. ఇక తెలంగాణ మరో ముఖ్యపట్టణమైన వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.37గా ఉండగా (శనివారం రూ.94.12), డీజిల్ ధర రూ.88.45 (శనివారం రూ.88.29 ) గా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.08 గా ఉండగా (శనివారం రూ.97.15 ), డీజిల్ రూ.90.62 వద్ద (శనివారం రూ.9.75) కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.96.13 పలకగా (శనివారం రూ.96.14 ), డీజిల్ ధర రూ.89.69 వద్ద (శనివారం రూ.89.76 ) కొనసాగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.11 ఉండగా (శనివారం రూ.92.20 ), డీజిల్ రూ.86.45 (శనివారం రూ.86.31 ) వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.94.22 గా (శనివారం రూ.93.98 ), ఉండగా.. డీజిల్ ధర రూ.86.37 (శనివారం రూ. 86.21) వద్ద కొనసాగుతోంది.