Petrol Diesel Price: రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?

దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత గత కొన్ని నెలలుగా నిలకడగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీ నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు..

Petrol Diesel Price: రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..?
Petrol Diesel Price
Follow us

|

Updated on: Nov 29, 2022 | 3:06 PM

దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత గత కొన్ని నెలలుగా నిలకడగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీ నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. ఇక వాహనదారులకు రానున్న రోజుల్లో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు తగ్గుతాయా? అంటే అవుననే చెబుతున్నాయి నివేదికలు. అంతర్జాతీయంగా మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశాలు భారీగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే వాహనదారులకు ఎంతో ఊరటనిచ్చినట్లు అవుతుంది.

సోమవారం బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా జనవరి నెల కనిష్టస్థాయికి పడిపోయింది. బ్యారెల్‌కు 2.6 డాలర్ల మేర దిగి వచ్చింది. 3 శాతం తగ్గుదలతో 80 డాలర్లకు క్షీణించింది. మార్చిలో క్రూడాయిల్‌ ధర 112 డాలర్లకుపైగా చేరింది. గ్లోబల్‌ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. అయితే ప్రతి రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారుతుంటాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గత కొన్ని నెలలుగా ధరలు పెంచడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.62 ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.31 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.27 ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.24 ఉంది.హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 109.64 ఉండగా, డీజిల్ ధర రూ.97.82 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.03 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.76 ఉంది.

ఇవి కూడా చదవండి

మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోలు ధర రూ.9.50, డీజిల్‌పై రూ.7 తగ్గింది. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర స్థాయి పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం