AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. మహిళలకు మాత్రమే ప్రత్యేకం

మహిళా సాధికారత కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. గత సంవత్సరం బడ్జెట్‌లో మహిళా పెట్టుబడిదారులు, ఆడపిల్లల కోసం మహిళా సమ్మాన్ పథకం ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి 2015లో ప్రారంభించబడింది, ముఖ్యంగా ఆడపిల్లల కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉంచాయి.

Investment Schemes: ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. మహిళలకు మాత్రమే ప్రత్యేకం
Investments
Nikhil
|

Updated on: Sep 05, 2024 | 6:00 PM

Share

మహిళా సాధికారత కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. గత సంవత్సరం బడ్జెట్‌లో మహిళా పెట్టుబడిదారులు, ఆడపిల్లల కోసం మహిళా సమ్మాన్ పథకం ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో ప్రచారంలో భాగంగా సుకన్య సమృద్ధి 2015లో ప్రారంభించబడింది, ముఖ్యంగా ఆడపిల్లల కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉంచాయి. అయితే ఆయా పథకాల్లో పెట్టుబడితో ఇతర పథకాలతో పోలిస్తే అధిక వడ్డీ వస్తుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ఆయా పథకాల గురించి కూడా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మాఝీ లడకీ బహిన్ యోజన 

మహారాష్ట్రలోని మహిళా నివాసితుల కోసం మాఝీ లడ్కీ బహిన్ యోజన ఆగస్టులో ప్రారంభించారు. ఈ పథకంలో నవంబర్ 2024 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మహారాష్ట్రకు చెందిన మహిళలు మాత్రమే ఈ పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారి వయస్సు 21 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఏదైనా బ్యాంకులో వారి పేరుపై బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలకు మించకూడదు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ 

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్  పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2023 నుంచి అమల్లోకి తీసుకుని వచ్చింది. భారతదేశంలోని మహిళల్లో పొదుపు అలవాటును పెంపొందించడం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలంతా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. అలాగే వడ్డీని త్రైమాసికానికి కలిపి ఖాతాలో జమ చేస్తారు. ఖాతా మూసివేత/ముందస్తు మూసివేత/పాక్షిక ఉపసంహరణ సమయంలో అర్హత మేరకు వడ్డీ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

సుకన్య సమృద్ధి యోజన 

సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడానికి రూపొందించారు. ఈ పథకంలో ప్రస్తుతం 8.2 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తున్నారు. అలాగే ఈ పథకంలో పెట్టుబడిదారులకు 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల కోసం సహజ లేదా చట్టపరమైన సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. స్కీమ్ నిబంధనల ప్రకారం ఒక డిపాజిటర్ ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరిచి ఆపరేట్ చేయవచ్చు. ఖాతాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 మరియు గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీస మొత్తం రూ. 250 డిపాజిట్ చేయకపోతే, వారికి రూ. 50 జరిమానా విధిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..