Flipkart: మిత్రమా.. రెడీగా ఉండు.. త్వరలో భారీ సేల్.. ఊహించని డిస్కౌంట్లు, ఆఫర్లు
వినియోగదారులు ఏదైనా షాపింగ్ చేయాలంటే ఆన్‌లైన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలైనా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పండగలు, ఇతర సమయాల్లో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అంటే ఫ్లిప్‌కార్టు భారీ..
వినియోగదారులు ఏదైనా షాపింగ్ చేయాలంటే ఆన్‌లైన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలైనా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. పండగలు, ఇతర సమయాల్లో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అంటే ఫ్లిప్‌కార్టు భారీ సేల్ నిర్వహిస్తుంటుంది. అదే బిగ్ బిలియన్ డేస్ సేల్. ఇందులో ఎక్కువ మంది వినియోగదారుల దృష్టి స్మార్ట్‌ఫోన్‌లపైనే ఉంటుంది. అందుకే ప్లాట్‌ఫారమ్ మొబైల్ పరికరాలపై అద్భుతమైన ఆఫర్‌లను తీసుకురాబోతోంది. ఈ సేల్ దాదాపు ఒక వారం పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం దీని అధికారిక తేదీని వెల్లడించలేదు. అయితే ఇది అక్టోబర్ 8 నుండి ప్రారంభమై అక్టోబర్ 15, 2024 వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Lifestyle: పెళ్లికి ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా? అలా చేస్తే మీకు తిరుగుండదు!
ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఫెస్టివ్ డేస్ సేల్:
బిగ్ బిలియన్ డే సేల్ ముగిసిన వెంటనే మీరు కొన్ని రోజుల తర్వాత రెండవ సేల్ ప్రారంభమవుతుంది. ఇందులో కూడా భారీ ప్రయోజనాలే ఉంటాయి. అంటే మీ పండుగ సీజన్ అద్భుతంగా ఉండబోతుంది. బిగ్ బిలియన్ సేల్‌ను సద్వినియోగం చేసుకోలేని వారు తదుపరి రాబోయే సేల్‌లో ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు. ఈ సేల్ 16 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమై 20 అక్టోబర్ 2024 వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Toll Tax Exemption: ఈ వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ సేల్‌లో మీరు విస్తృత శ్రేణిలో డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఇలా ఒక్కటేమిటి మరెన్నో ఉంటాయి. ఈ సేల్‌లో ప్లాట్‌ఫారమ్ తన కస్టమర్‌లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లు:
మీరు ఈ సేల్‌లో దాదాపు అన్ని ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లేదా బ్యాంక్ డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మీ ఫోన్ మోడల్, పనితీరు, ఇంకా అన్ని రకాలుగా తనిఖీ చేస్తారు.
ఇది కూడా చదవండి: Public Holidays: సెప్టెంబరు 7, 16న పబ్లిక్ హాలిడేస్.. విద్యార్థులకు వరుస సెలవులు.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి