Flipkart Offers: మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే మంచి అవకాశం..
Flipkart Super Cooling Days 2024: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తన వార్షిక సమ్మర్ సేల్లో భాగంగా ఏప్రిల్ 17 నుంచి 23 వరకూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎయిర్ కండిషనర్లు(ఏసీలు), రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వంటి అనేక రకాల కూలింగ్ గృహోపకరణాలను సరసమైన ధరలకు అందిస్తోంది. ఈ ఫ్లిప్ సేల్ పేరు 6వ ఎడిషన్ సూపర్ కూలింగ్ డేస్ 2024.
భానుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వేడి గాలులతో హడలెత్తిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో అందరూ ఏసీలు కూలర్ల బాట పడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఏసీలను కూడా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా కొత్త ఏసీ, లేదా కూలర్ లేదా రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తన వార్షిక సమ్మర్ సేల్లో భాగంగా ఏప్రిల్ 17 నుంచి 23 వరకూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎయిర్ కండిషనర్లు(ఏసీలు), రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వంటి అనేక రకాల కూలింగ్ గృహోపకరణాలను సరసమైన ధరలకు అందిస్తోంది. ఈ ఫ్లిప్ సేల్ పేరు 6వ ఎడిషన్ సూపర్ కూలింగ్ డేస్ 2024. వేసవి తాపాన్ని అధిగమించడానికి వినియోగదారులకు కూలింగ్ గృహోపకరణాలపై అద్భుతమైన డీల్‌లను ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
సేల్లో ఏముంటాయంటే..
ఫ్లిప్ కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ 2024లో టాప్ బ్రాండ్‌లు, విక్రేతల ద్వారా విభిన్న కస్టమర్ అవసరాలు, బడ్జెట్‌లను బేరీజు వేసుకుంటూ బెస్ట్ శీతలీకరణ ఉపకరణాలను అందిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఫ్యాన్లు విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్లో ఉత్పత్తులు కేవలం రూ. 1299 నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు పొందొచ్చు. అదే విధంగా కొత్త కస్టమర్ ఆఫర్‌లు, ట్యాప్ అండ్ విన్, సూపర్‌కాయిన్స్‌లో ఆఫర్‌లు వంటి అద్భుతమైన డీల్‌లు ఆఫర్‌లను పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ వంటి చెల్లింపు ఎంపికలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు తమ ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వ్యూ ఇన్ 360 డిగ్రీస్, ఫైర్ డ్రాప్స్ గేమిఫికేషన్, 3డీ వ్యూ అనే ప్రత్యేక కస్టమర్ సహాయ ఫీచర్లు ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ జీవస్ ఇన్‌స్టాలేషన్‌లతో సహా సౌకర్యవంతమైన, నమ్మదగిన,తక్కువ ఖర్చుతో కూడిన విక్రయాల సేవలను అందిస్తుందని ఓ ప్రకటనలో ప్రకటించుకుంది.
ఈ బ్రాండ్లపై ఆఫర్లు..
- రిఫ్రిజిరేటర్ల విషయానికి వస్తే.. శామ్సంగ్, ఎల్జీ, వర్ల్‌పూల్, హైయర్, గోద్రెజ్, ఐఎఫ్బీ వంటి ప్రముఖ బ్రాండ్‌లలో సింగిల్-డోర్, సైడ్-బై-సైడ్ డోర్, బాటమ్ మౌంట్, ఫ్రాస్ట్ ఫ్రీ, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ల ఎంపికతో భారతదేశపు అతిపెద్ద రిఫ్రిజిరేటర్ స్టోర్‌ను ఈ సేల్ ప్రదర్శిస్తుంది. రిఫ్రిజిరేటర్ల ధరలు రూ. 9,990 నుంచి రూ. 2,00,000 మధ్య ఉంటాయి.
- ఏసీల విషయానికి వస్తే.. ఎల్జీ, వోల్టాస్, గోద్రెజ్, డైకిన్, పానాసోనిక్, బ్లూ స్టార్ వంటి ఏసీలను రూ. 25,000 నుంచి రూ. 65,000 ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి. వైఫై కనెక్టివిటీ, విద్యుత్ వినియోగంపై అత్యుత్తమ స్టార్ రేటింగ్ వీటిల్లో ఉన్నాయి. అధునాతన సాంకేతిక లక్షణాలతో 0.8 టన్ను నుంచి 2 టన్ను వరకు విస్తృతమైన ఇన్వర్టర్ ఏసీలు ఈ విక్రయంలో ఉంటాయి.
- ఫ్లిప్‌కార్ట్ రూ. 1,299 నుంచి రూ. 15,000 వరకు సీలింగ్ ఫ్యాన్‌లపై విస్తారమైన ఆప్షన్లను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లోని లార్జ్ అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ గుప్తా మాట్లాడుతూ సూపర్ కూలింగ్ డేస్ 6వ ఎడిషన్ వినియోగదారులకు బహుళ ప్రసిద్ధ బ్రాండ్‌ల నుంచి విస్తృత-శ్రేణి విలువ-ఆధారిత ఉత్పత్తులను అందిస్తుందని చెప్పారు. కస్టమర్లు పాత రిఫ్రిజిరేటర్‌లను మార్చుకోవడంపై రూ. 22,000 వరకు తగ్గింపు, పాత ఏసీల మార్పిడిపై రూ. 8,000 తగ్గింపు వంటి వివిధ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..