Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు అలర్ట్.. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..
Online Shopping: పండుగ సీజన్ కొనసాగుతోంది. దీపావళి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రజలందరు షాపింగ్‌లో మునిగిపోయారు. ఈ-కామర్స్ భారతదేశంలోని

Online Shopping: పండుగ సీజన్ కొనసాగుతోంది. దీపావళి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రజలందరు షాపింగ్‌లో మునిగిపోయారు. ఈ-కామర్స్ భారతదేశంలోని షాపింగ్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. కిరాణా సామాగ్రి నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వరకు అందరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ షాపింగ్ అనేది వేగంగా, సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ఇందులో మోసపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
పాస్‌వర్డ్, పిన్ నంబర్‌ను పదేపదే ఉపయోగించవద్దు ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఒకే పాస్‌వర్డ్‌ను పదే పదే ఉపయోగించవద్దు. అంతేకాదు పాస్‌వర్డ్ కొంచెం కష్టంగా ఉండేవిధంగా చూసుకోవాలి. వ్యక్తిగత వివరాలను ఉపయోగించకుండా పాస్‌వర్డ్ ఉండాలి. ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే ప్రతి మూడు నెలలకు మీ పిన్ నంబర్‌ను మార్చండి. డిజిటల్ వాలెట్‌కి కూడా అదే ఉపయోగిస్తే మంచిది.
పెద్ద వెబ్సైట్లలో షాపింగ్ చేయండి పెద్ద వెబ్సైట్లలో షాపింగ్ చేస్తే మంచిది. ఎందుకంటే అవి పటిష్టమైన భద్రతా వ్యవస్థలను కలిగి ఉంటాయి. మీ ఇన్‌బాక్స్‌కు మెస్సేజ్ పంపడం ద్వారా మోసగాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తారు. దీనినే ఫిషింగ్ అంటారు. లింక్ మిమ్మల్ని సాధారణ షాపింగ్ పోర్టల్‌లా డిజైన్‌ని కలిగి ఉన్నా నకిలీ వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అంతేకాదు ఏదైనా ఈ-కామర్స్ యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తే కూడా అవి Google Play Store ధృవీకరించారా లేదా నిర్ధారించుకోవాలి. బ్యాంకులు మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. పెద్ద బ్యాంకుల మొబైల్ యాప్‌లు నిరంతరం అప్‌గ్రేడ్ చేయబడే భద్రతా లక్షణాలతో ఉంటాయి. వారి క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా మంచి భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. వీటినే ఎక్కువగా ఉపయోగించాలి.