HOP Electric Scooters: ఈ-స్కూటర్లపై ఫెస్టివ్ ఆఫర్లు.. రూ. 4వేలకు పైగానే తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవి..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారు హాప్(హెచ్ఓపీ) ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ పలు ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. హాప్ లియో, లైఫ్ మోడళ్లపై గణేష్ చతుర్థి సందర్భంగా డిస్కౌంట్లు ప్రకటించింది. లియో మోడల్ పై రూ. 4,100, లైఫ్ మోడల్ పై రూ. 3,100 తగ్గింపును తయారీదారు అందిస్తోంది. ఈ ఆఫర్ల సాయంతో పండుగల సీజన్లో అత్యధిక సేల్స్ రాబట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. అన్ని ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు వస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఇదే తరహా వ్యాపార సరళి కనిపిస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారు హాప్(హెచ్ఓపీ) ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ పలు ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. హాప్ లియో, లైఫ్ మోడళ్లపై గణేష్ చతుర్థి సందర్భంగా డిస్కౌంట్లు ప్రకటించింది. లియో మోడల్ పై రూ. 4,100, లైఫ్ మోడల్ పై రూ. 3,100 తగ్గింపును తయారీదారు అందిస్తోంది. ఈ ఆఫర్ల సాయంతో పండుగల సీజన్లో అత్యధిక సేల్స్ రాబట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రానున్న దసరా, దీపావళి పండుగలను కూడా పురస్కరించుకుని మరిన్ని ఆఫర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ హాప్ లియో, లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ ఇది..
ఈ హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ 125కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 72వోల్ట్స్ ఆర్కిటెక్చర్, అధిక పనితీరు కలిగిన మోటార్ ఉంటుంది. దీని సాయంతో భారీ ఎత్తులకు కూడా సులభంగా ఎక్కేయగలుగుతాయి. 180కేజీల బరువుతో కూడా సునాయాసంగా వెళ్లిపోతాయి. ఈ స్కూటర్లు 19.5 లీటర్ల బూట్ స్పేస్ తో వస్తాయి. వీటిలో ఇంటర్ నెట్ జీపీఎస్, మొబైల్ యాప్ కనెక్టివిటీ వంటి అనేక అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉంటాయి.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే పార్క్ అసిస్ట్, ఐదు కిలోమీటర్ల వరకూ రివర్స్ గేర్, సైడ్ స్టాండ్ సెన్సార్, మూడు రకాల రైడింగ్ మోడ్లు ఉంటాయి. అందులో రివర్స్ గేర్ మోడ్ కూడా ఉంటుంది. ఎల్ఈడీ కన్సోల్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, యూఎస్బీ చార్జింగ్ పోర్టు, రిమోట్ కీ ఆపరేషన్, యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ థెఫ్ట్ వీల్ లాక్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. రైడర్లకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. సిటీ పరిధిలో వినియోగానికి ఈ స్కూటర్లు సరిగ్గా సరిపోతాయి. ట్రాఫిక్ ఇబ్బందులున్నా సులభంగా వాటిని ఛేదించుకొని వెళ్లిపోవచ్చు. ఇంటి అవసరాలకు కూడా బాగా ఉపయోగపడతాయి.
ఓలా స్కూటర్లపై కూడా..
ఈ హాప్ కంపెనీ మాత్రమే కాదు. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-స్కూటర్ల తయారీ దారు ఓలా కూడా పలు ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. ఓలా ఎస్1 స్కూటర్లపై లపు డిస్కౌంట్లు ప్రకటించింది. పలు రకాల డిస్కౌంట్లు అన్నీ కలిపి రూ. 19,500 వరకూ తగ్గింపును అందించింది. అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 20వ తేదీకి పూర్తి అయిపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..