Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugam FD Scheme: మెచ్యూరిటీ పూర్తి కాకుండా ఫైన్ లేకుండా ఎఫ్‌డీ అందజేత.. కొత్త పథకం లాంచ్ చేసిన బ్యాంక్ ఏంటో తెలుసా?

అనుకోకుండా సొమ్ము అవసరమై ఆ ఎఫ్‌డీను క్యాన్సిల్ చేస్తే దాని కోసం బ్యాంకులకు ప్రీ క్లోజర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఖాతాదారులకు మేలు చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్( పీఎన్‌బీ) సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

Sugam FD Scheme:  మెచ్యూరిటీ పూర్తి కాకుండా ఫైన్ లేకుండా ఎఫ్‌డీ అందజేత.. కొత్త పథకం లాంచ్ చేసిన బ్యాంక్ ఏంటో తెలుసా?
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: May 15, 2023 | 6:00 PM

కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే నెలానెలా కరెక్ట్‌గా వడ్డీ వస్తున్నా అనుకోకుండా సొమ్ము అవసరమై ఆ ఎఫ్‌డీను క్యాన్సిల్ చేస్తే దాని కోసం బ్యాంకులకు ప్రీ క్లోజర్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఖాతాదారులకు మేలు చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్( పీఎన్‌బీ) సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సుగమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఎఫ్‌డీ స్కీమ్‌ను మెచ్యూరిటీ సమయానికి ముందే రద్దు చేసుకుంటే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మన సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మాత్రం పీఎన్‌బీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షలకు పరిమితం చేసింది. కాబట్టి ఈ పథకం గురించిన అదనపు వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

గతంలో రుణదాత వినియోగదారులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే కనీస డిపాజిట్ రూ.10,000గా ఉండేది. అలాగే గరిష్టంగా రూ. 10 కోట్లతో ఖాతా తెరిచే అవకాశం ఉండేది. తాజా రివిజన్‌తో వినియోగదారులు అకాల ఉపసంహరణ జరిమానా ప్రయోజనాన్ని రూ. 10 లక్షల వరకు మాత్రమే పొందగలరు. ఈ డిపాజిట్ కాలవ్యవధి 46 రోజుల నుంచి 120 నెలల వరకు ఉంటుంది. ఖాతాను ఒక వ్యక్తి ఒంటరిగా లేదా ఇతరులతో కలిసి తెరవవచ్చు. 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌లు కూడా ఈ పథకం కింద వారి సొంత పేరు మీద డిపాజిట్ చేయవచ్చు. ఒక సమయంలో కనీసం రూ. 1,000 ఉపసంహరణకు లోబడి మెచ్యూరిటీకి ముందు ఎంతైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిటర్లు మొత్తం డిపాజిట్‌ను విచ్ఛిన్నం చేయకుండా, అలాగే మిగిలిన డిపాజిట్‌పై వడ్డీని కోల్పోకుండా ముందుగానే విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్ అనుమతిస్తుంది.  ఈ మేరకు పీఎన్‌బీ తన వెబ్‌సైట్‌లో ప్రకటనలో పేర్కొంది. అలాగే డిపాజిట్ విలువ (ప్రిన్సిపల్ మొత్తం) తదనుగుణంగా తగ్గిస్తారు. డిపాజిట్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి ఫెనాల్టీ విధించరు. ఏదైనా డిపాజిటర్ మెచ్యూరిటీకి ముందు మొత్తం డిపాజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరుకుంటే ఎలాంటి ఫైన్ అలాగే వడ్డీ రేటు విధించబడదు. చెల్లించాల్సిన కాంట్రాక్టు రేటు లేదా డిపాజిట్ అమలు చేసిన కాలవ్యవధికి వర్తించే కాంట్రాక్టు తేదీలో స్కీమ్ కింద రేటు ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు. కాబట్టి ఈ పథకంపై మరిన్ని వివరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. లేకపోతే దగ్గర్లోని పీఎన్‌బీ శాఖను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
రేపో మాపో కుక్క చావు చస్తావు..
రేపో మాపో కుక్క చావు చస్తావు..
మెగా కిచెన్స్.. 10 లక్షల మందికి ఒకేసారి వంట చేస్తారిక్కడ
మెగా కిచెన్స్.. 10 లక్షల మందికి ఒకేసారి వంట చేస్తారిక్కడ
మందారంలో ఇది కలిపి రాస్తే.. ఒత్తైన పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
మందారంలో ఇది కలిపి రాస్తే.. ఒత్తైన పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
యూజర్లకు శుభవార్త.. ఇక వాట్సాప్‌ స్టేటస్‌లో 90 సెకన్ల వీడియో.
యూజర్లకు శుభవార్త.. ఇక వాట్సాప్‌ స్టేటస్‌లో 90 సెకన్ల వీడియో.
మహేష్ కోసం బాహుబలి ఫార్ములా రిపీట్.. జక్కన్న ప్లాన్ ఏంటి.?
మహేష్ కోసం బాహుబలి ఫార్ములా రిపీట్.. జక్కన్న ప్లాన్ ఏంటి.?
దేశంలో నంబర్‌ వన్‌ బ్యాంకు ఏది? టాప్‌ 10 బ్యాంకుల జాబితా
దేశంలో నంబర్‌ వన్‌ బ్యాంకు ఏది? టాప్‌ 10 బ్యాంకుల జాబితా