AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: 1 కోటి మందికి కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వనుందా? ఇందులో నిజమెంత?

Fact Check: Fact Check: Fact Check: ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే ఇటీవల ఓ వార్త వైరల్‌ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్మార్ట్‌ ఫోన్‌ ఉచితంగా ఇస్తుందని దీని సారంశం..

Fact Check: 1 కోటి మందికి కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వనుందా? ఇందులో నిజమెంత?
Subhash Goud
|

Updated on: Dec 15, 2024 | 2:19 PM

Share

కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించనుంది. దేశంలోని 1 కోటి మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఇంట్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉచిత స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఉండాల్సి ఉంటుంది. మీకు 18 సంవత్సరాలు ఉంటే మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు. అంటే ఈ పథకం కింద మీకు ఉచిత స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. YouTube ఛానెల్ వీడియో థంబ్‌నెయిల్స్‌ చూస్తే నిజమనే అనిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్‌ వార్త పూర్తిగా అబద్దమని తెల్చి చెప్పంది. X హ్యాండిల్‌లో ఛానెల్ పేరు, వీడియో ఫోటో ద్వారా బీఐబీ (PIB) ప్రభుత్వంలో అలాంటి పథకం లేదని, వీడియో థంబ్‌నెయిల్ అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని, దీనిని ఎవ్వరు కూడా నమ్మవద్దని స్పష్టం చేసింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం, ‘సర్కారీ సౌచ్నా’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక వీడియో కేంద్ర ప్రభుత్వం 1 కోటి మందికి ఉచిత మొబైల్ ఫోన్‌లను ఇస్తుందని పేర్కొంది. దీనికి ఉచిత స్మార్ట్‌ఫోన్ యోజన అని కూడా పేరు పెట్టారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని కుటుంబ సభ్యులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా ఉచితంగా మొబైల్ ఫోన్లు అందజేస్తామని ఈ యూట్యూబ్ ఛానెల్ వీడియో చెబుతోంది. అయితే ఈ ఉచిత స్మార్ట్‌ఫోన్ ఎందుకు ఇవ్వబడుతుందని, ఈ పథకం డిజిటల్ ఇండియా కింద ప్రారంభినట్లు వైరల్‌ అవుతోంది.

అంతేకాదు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి ఎక్కడా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని వీడియోలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఫారమ్ నింపి ఎంపిక చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి మొబైల్ కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఇప్పటికే 2 మిలియన్ల మందికి మొబైల్స్ అందించినట్లు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత మొబైల్ మాత్రమే కాదు, 3 సంవత్సరాల డేటా, అపరిమిత కాలింగ్ కూడా ఉచితంగా అందించనుందని ఈ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రాజస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు వెళ్లాలని సూచించింది. ఈ వైరల్‌ అవుతున్న వార్త పూర్తిగా అబద్ధమని పీఐబీ స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రారంభించలేదని పేర్కొంది. సో.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా అబద్దం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా