LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మీరు ఎంత గ్యాస్ వినియోగించారో తెలిపే గ్యాస్ సిలెండర్ లాంచ్

LPG Gas: ఇండియన్ ఆయిల్ (ఐఓసి) తన ఎల్‌పిజి వినియోగదారులకు ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఫైబర్‌తో తయారు చేసిన లైట్ అండ్ కలర్‌ఫుల్ గ్యాస్ సిలిండర్లను..

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మీరు ఎంత గ్యాస్ వినియోగించారో తెలిపే గ్యాస్ సిలెండర్ లాంచ్
Xtra Tej Cylinder
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2021 | 8:17 PM

LPG Gas: ఇండియన్ ఆయిల్ (ఐఓసి) తన ఎల్‌పిజి వినియోగదారులకు ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఫైబర్‌తో తయారు చేసిన లైట్ అండ్ కలర్‌ఫుల్ గ్యాస్ సిలిండర్లను కంపెనీ విడుదల చేసింది. ఈ సిలెండర్లుప్రత్యేకత ఏమిటంటే.. వినియోగదారులు ఎంత గ్యాస్ ఖర్చు చేశారో, గ్యాస్ ఎంత మిగిలి ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ సిలిండర్‌కు ఎక్స్‌ట్రా తేజ్ (Indane Xtra Tej Cylinder) అనే పేరు పెట్టారు. ఈ సిలెండర్లను ఉపయోగించే వినియోగదారులు 5 శాతం ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. అంతేకాదు వంటలను కూడా త్వరగా చేసుకోవచ్చు అని తయారీదారులు తెలిపారు.ఈ సిలిండర్ నీలం రంగులో ఉంది ఆకర్షణీయంగా ఉంది.

ఈ సిలిండర్‌ను ఏ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ గ్యాస్ సిలిండర్ ఆకర్షణీయమైన రంగులో చాలా తేలికగా ఉంటుంది. ఎంత తేలికగా అంటే.. ఇప్పుడు గ్యాస్ సిలెండర్ల కంటే 50 శాతం బరువు తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్తో తయారు చేసిన ఈ సిలిండర్ చాలా సురక్షితంగా ఉంటుంది. ఈ సిలెండర్ లో 10 కిలోల గ్యాస్ వస్తుంది. అంతేకాదు సిలెండర్ పారదర్శకంగా ఉండడంతో వినియోదారుడు తాను ఎంత గ్యాస్ వినియోగించాడో స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీంతో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో అంచనావేసుకుని.. బుక్ చేసుకునేటెన్షన్ లేకుండా గ్యాస్ సిలెండర్ ను బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ సిలిండర్ కావాలనుకుంటే సమీప ఇండానే పంపిణీదారుని సంప్రదించాల్సి ఉంది.

అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కూడా తన వాణిజ్య వినియోగదారుల కోసం ప్రత్యేక సిలిండర్ ఎక్స్‌ట్రా తేజ్‌ను కూడా తీసుకువచ్చింది. ఈ సిలెండర్ ను ఉపయోగించే వినియోగదారులు 5 శాతం గ్యాస్ ఆదా చేయడమే కాదు.. ఆహారాన్ని త్వరగా తయారు చేసుకోవచ్చు.. ఈ సిలెండర్ కూడా నీలి రంగులో ఉంటుంది.

అయితే ఇండానే ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా కూడా వినియోగలించుకోవచ్చు. రెస్టారెంట్ల వినియోగదారులకు ఈ సిలెండర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. కొత్త నానో టెక్నాలజీ ద్వారా ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసింది. ఐఓసి వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎక్స్‌ట్రా ఫాస్ట్ సిలిండర్‌ను వాణిజ్య ప్రదేశాల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. దీన్ని దేశీయ సిలిండర్‌గా ఉపయోగించలేరు.ప్రస్తుతం ఇది ఎంచుకున్న జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం మీరు టోల్ ఫ్రీ నంబర్ 18002333555 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు .

Also Read: Tokyo Olympics 2021: నిరాశ పరచిన భారత మహిళా హాకీ జట్టు.. నెదర్లాండ్ చేతితో 1-5 గోల్స్ తేడాతో ఓటమి