Super kid: ఐదేళ్ల వయసైనా తగ్గేదేలే.. 312 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన బాలుడు
సాధారణంగా ఐదేళ్ల వయసున్న పిల్లలు అప్పుడే స్కూలుకు వెళ్లడం మొదలుపెడతారు. అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులను వదిలి పాఠశాలకు వెళ్లడానికి మారాం చేస్తుంటారు. పూర్తిస్థాయిలో పరిగెట్టడం కూడా రాని వయసు అది. కానీ జైన్ సోఫుగ్లు అనే ఐదేళ్ల బాలుడు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆ వయసులోనే లంబోర్ఘిని రివెల్టోను గంటకు 312 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు.
సాధారణంగా ఐదేళ్ల వయసున్న పిల్లలు అప్పుడే స్కూలుకు వెళ్లడం మొదలుపెడతారు. అక్షరాలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులను వదిలి పాఠశాలకు వెళ్లడానికి మారాం చేస్తుంటారు. పూర్తిస్థాయిలో పరిగెట్టడం కూడా రాని వయసు అది. కానీ జైన్ సోఫుగ్లు అనే ఐదేళ్ల బాలుడు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆ వయసులోనే లంబోర్ఘిని రివెల్టోను గంటకు 312 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. మీరు నమ్మలేకున్నా ఇది వందశాతం నిజం. ఈ బుడతడు గతంలోనే ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, నిస్సాన్ 200ఎస్ఎక్స్ డ్రిఫ్ట్ కార్, టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్ వంటి కార్లను కూడా నడిపి రికార్డు సాధించాడు.
టర్కిష్ మోటార్ సైకిల్ రేసర్ కెనన్ సోఫుగ్లు కుమారుడే జైన్ సోఫుగ్లు. సూపర్ కార్లను అత్యంత వేగంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. జైన్ కార్లను నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొత్తగా ఇటాలియన్ లంబోర్ఘిని రివెల్టో కారుతో తిరిగి వచ్చాడు. దానిని 312 వేగంతో నడుపుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన క్లిప్‌లో జైన్ కారు డ్రైవింగ్ సీట్‌లోకి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అతడి ఎత్తు, ఆకారానికి అనువుగా పెడల్స్, స్టీరింగ్ వీల్‌ను తిప్పడానికి అనువుగా డ్రైవింగ్ సీటుకు ఒక ప్రత్యేక సీటు ఏర్పాటు చేశారు. తండ్రి కూడా బాలుడితో కారులో ఉన్నాడు. జైన్ కు స్టీరింగ్ వీల్ పైకి చూడటం కష్టంగా ఉన్నప్పటికీ, కారుతో చాలా సౌకర్యంగా ఉన్నాడు. ఆ తర్వాత కారును 312 కిలోమీటర్లకు పెంచాడు. అలాగే కారు రేసింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు.
View this post on Instagram
జైన్ సోఫుగ్‌లు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అతడి గో-కార్ట్‌లు, మోటార్‌సైకిళ్లతో పాటు అనేక కార్లను నడపడం చూడవచ్చు. కొత్తగా వీడియో చూసిన వారికి ఆశ్చర్య కలిగించినా అతడిని ఫాలో అవుతున్న వారికి మాత్రం ఇవన్నీ పరిచయమే. టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్, నిస్సాన్ 200 ఎస్ఎక్స్ డ్రిఫ్ట్ కారు, ఫెరారీ ఎస్ఎఫ్90 నడిపిన జైన్ కు లంబోర్ఘిని అత్యంత వేగంగా నడపడం పెద్ద కష్టం కాదని వారి అభిప్రాయం. ఇటాలియన్ బ్రాండ్ కు చెందిన హై-ఎండ్ మోడళ్లలో లంబోర్ఘిని రివెల్టో ఒకటి. దీనిని 2023లో మన దేశంలో విడుదల చేశారు. ఈ కారు ధర రూ. 8.89 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 6.5 లీటర్ వీ12 ఇంజన్‌తో 825 హెచ్ పీ శక్తిని, 725 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌కు మద్దతుగా మూడు ఎలక్ట్రిక్ మోటార్లు 3.8 కేడబ్ల్యూ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ మూడు కలిసి కారుకు 1,015 హెచ్ పీ శక్తి, 807 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. దీనివల్ల ఈ కారు కేవలం 2.5 సెకండ్లలో సున్నా నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ కు చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం 350 కేఎమ్ పీఎల్. జైన్ ఈ కారును 312 కేఎమ్ పీఎల్ వేగంతో నడపడం విశేషం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి