AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లోకి భారీగా దేశీయ నిధులు.. అనిశ్చితిలోనూ ఉత్సాహం చూపిస్తున్న పెట్టుబడిదారులు..

ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడి నిధులు వెనక్కు వెళ్తుంటే.. దేశీయ పెట్టబడిదారులు పెట్టుబడులు పెంచుతున్నారు. మేలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి...

Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లోకి భారీగా దేశీయ నిధులు.. అనిశ్చితిలోనూ ఉత్సాహం చూపిస్తున్న పెట్టుబడిదారులు..
Mf Investment
Srinivas Chekkilla
|

Updated on: Jun 10, 2022 | 4:32 PM

Share

ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడి నిధులు వెనక్కు వెళ్తుంటే.. దేశీయ పెట్టబడిదారులు పెట్టుబడులు పెంచుతున్నారు. మేలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా ఉన్నాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూన్నాయి. ఏప్రిల్‌లో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లు కాగా, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నెలవారీ సిప్‌ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడం విశేషం.

మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్‌ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి. లార్జ్‌క్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, సెక్టోరల్‌ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు వచ్చాయి. ఇండెక్స్‌ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులు రాగా.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.203 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే డెట్‌ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.7,532 కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు ఏప్రిల్‌ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు తగ్గింది.