Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF UAN: మీరు మీ ఈపీఎఫ్‌ యూఏఎన్‌ని ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటున్నారా? సులభమైన మార్గాలు

ఈపీఎఫ్ స్కీమ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌గా రూపొందించబడింది. ప్రతి నెలా ఒక ఉద్యోగి జీతం బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం ఈపీఎఫ్‌కి మినహాయించబడుతుంది. అదే మొత్తం యజమాని ద్వారా జమ చేయబడుతుంది. ఈపీఎఫ్‌ స్కీమ్‌ కింద నమోదు చేసుకున్న ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్‌వో ​​12-అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని జారీ చేస్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం..

EPF UAN: మీరు మీ ఈపీఎఫ్‌ యూఏఎన్‌ని ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటున్నారా? సులభమైన మార్గాలు
EPFO
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2023 | 8:11 PM

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వారి పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రత కోసం నిర్వహించబడే పొదుపు పథకం. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలు ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. 20 మంది కంటే తక్కువ ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థలు లేదా వ్యాపారాలు ఈసీఎఫ్‌ పథకం కోసం స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ స్కీమ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌గా రూపొందించబడింది. ప్రతి నెలా ఒక ఉద్యోగి జీతం బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతం ఈపీఎఫ్‌కి మినహాయించబడుతుంది. అదే మొత్తం యజమాని ద్వారా జమ చేయబడుతుంది. ఈపీఎఫ్‌ స్కీమ్‌ కింద నమోదు చేసుకున్న ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్‌వో ​​12-అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని జారీ చేస్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం, ఉద్యోగులు, అసంఘటిత కార్మికులందరూ తమ ఆధార్ కార్డులను వారి ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలకు తప్పనిసరిగా లింక్ చేయాలి.

మీ యూఏఎన్‌ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడకపోతే మీ యజమాని మీ నెలవారీ సహకారాన్ని డిపాజిట్ చేయలేరు. అందువల్ల మీ ఆధార్‌ను ఇప్పటికే లింక్ చేయకపోతే లింక్‌ చేసుకోవాలని గతంలోని సూచించింది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అయితే, ఈపీఎఫ్‌వో​ఏప్రిల్ 2023లో యూఏఎన్‌ని ఆధార్‌తో లింక్ చేయడానికి మార్చి 31, 2024 వరకు పొడిగించింది ఈపీఎఫ్‌వో.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో UANని ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?:

యూనివర్సల్ ఖాతా నంబర్ సక్రియంగా ఉంటే దానిని ఆధార్‌కి లింక్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.

  • ముందుగా UMANG యాప్‌ని ఉపయోగించడం ద్వారా కూడా చేసుకోవచ్చు.
  • EPFO ​e-KYC పోర్టల్‌లో OTP ధృవీకరణను ఉపయోగించడం ద్వారా కూడా చేసుకోవచ్చు.
  • ఆఫ్‌లైన్‌ ఫారమ్‌ సమర్పించడం ద్వారా

1. UMANG యాప్ ఉపయోగించి యూఏఎన్‌-ఆధార్ లింక్ చేయడం ఎలా?

  • UMANG యాప్‌కి లాగిన్ చేసి, మీ UANని నమోదు చేయండి.
  • UAN నమోదిత మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.
  • OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ ఆధార్ వివరాలను నమోదు చేయండి.
  • ఆధార్ నమోదిత మొబైల్ నంబర్‌తో పాటు ఇమెయిల్ చిరునామాపై మరొక OTP నంబర్ పంపబడుతుంది.
  • OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత UANతో ఆధార్ లింక్ చేయబడుతుంది.

2. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో యూఏఎన్‌ ఆధార్ లింక్ చేయడం

  • EPFO ​​e-sewa అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ UAN ఆధారాలను ఉపయోగించి EPF ఖాతాకు లాగిన్ చేయండి.
  • ‘మేనేజ్’ విభాగంలోని నో యువర్ కస్టమర్ (KYC) ఎంపిక కోసం వెతకండి. దానిపై క్లిక్‌ చేయండి.
  • ఆపై ఆధార్‌ని ఎంచుకుని, వివరాలను నమోదు చేయండి. మరింత కొనసాగడానికి, సేవ్ పై క్లిక్ చేయండి.
  • UIDAI డేటాను ఉపయోగించి ఆధార్ నిర్ధారించబడుతుంది.
  • కేవైసీ పూర్తయిన తర్వాత మీ ఆధార్ నంబర్‌ను ఈపీఎఫ్‌ అకౌంట్‌కు లింక్ చేయబడుతుంది.

3. యూఏఎన్‌ ఆధార్ ఆఫ్‌లైన్‌లో లింక్ చేయడం..

ఆఫ్‌లైన్‌లో మీ ఈపీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడానికి మీరు తప్పనిసరిగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO’s) బ్రాంచ్‌లు లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లలో (CSC) హాజరు కావాలి. UANని ఆధార్‌తో లింక్ చేయడానికి దరఖాస్తును వ్యక్తిగతంగా సమర్పించాలి. దానితో పాటు మీ ఆధార్ కార్డ్ స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీని సమర్పించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి