కారును ఇలా వాడుతున్నారా.. అయితే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్లే..
సుఖమైన ప్రయాణానికి కారును మించిన వాహనం లేదు. ఈ రోజుల్లో కారు మధ్యతరగతి కూడా కామన్ వెహికల్‌గా మారింది. అయితే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఒక రీసెర్చ్ నిర్వహించింది. అందులో కార్లు వాడే ఏసీల్లో 101 ఎలక్ట్రిక్ గ్యాస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 99 శాతం ఉన్నాయని తేల్చింది.

సుఖమైన ప్రయాణానికి కారును మించిన వాహనం లేదు. ఈ రోజుల్లో కారు మధ్యతరగతి కూడా కామన్ వెహికల్‌గా మారింది. అయితే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఒక రీసెర్చ్ నిర్వహించింది. అందులో కార్లు వాడే ఏసీల్లో 101 ఎలక్ట్రిక్ గ్యాస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 99 శాతం ఉన్నాయని తేల్చింది. అయితే ఇది అన్ని రకాల కార్లతో కాదు.. ఏ కార్లలో అయితే TCIPP అనే రకం గ్యాస్‌ను ఏసీ కోసం వాడతారో అందులో ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. దీనివల్ల న్యూరోలాజికల్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అనేది అధ్యయనంలో తేలింది. అదే అమెరికాలోని డూప్ యూనివర్సిటీలో టాక్సోలజి సైంటిస్ట్‌లు దీనిపైన ప్రత్యేక రీసర్చ్ కూడా నిర్వహించారు.
ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూసాయి. కారులో ఉండే లెదర్ సీట్లు కూడా క్యాన్సర్‌కు కారకంగా మారుతున్నాయని తెలిపింది. కారులో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ప్రయాణించే పెద్ద వాళ్ళ కంటే చిన్న పిల్లలే ఈ రకమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందంటూ చెప్పింది. ఈ టాక్సిస్ ఫ్లేమ్ గ్యాస్ ఎండాకాలంలోనే ఎక్కువగా విడుదలవుతుంది. కారులో ఉండే మెటీరియల్స్‌తో ఈ గ్యాస్ తోడవడం వల్ల ప్రమాదకరమైన కెమికల్ మనం కారులో కూర్చుని పీల్చుకోవాల్సి వస్తుంది. లగ్జరీలు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్లు పెరగడానికి కారణం అవుతోంది. కారులో రోజు గంటకంటే ఎక్కువగా ప్రయాణం చేసే వాళ్లకి ఈ ప్రమాదం ఎక్కువగా ఉందనేది అధ్యయనం తెలిపింది.
ఇక కారులో ఉండే ఫైర్ ఫైటర్స్ వల్ల కూడా శ్వాస కోసం ఇబ్బందులు వస్తున్నాయట. చాలా రోజులపాటు ఫైర్ ఫైటర్ సిలిండర్‌ని కారులో ఉంచుకోవడం వల్ల కొద్దికొద్దిగా అందులో ఉండే ఫోమ్ రిలీజ్ అవుతుంది. దానిని తెలియకుండానే మనం పీల్చుకుంటున్నాం. ఇది తీవ్రమైన బ్రీతింగ్ సమస్యలకు కారణంగా మారుతుందని తెలిపింది. ఈమధ్య ఇంటర్నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఫైర్ ఫైటర్స్ విషయంలో కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే ఈ ప్రమాదం కార్లలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. పెద్ద వాహనాల్లో ప్రయాణిస్తే ఈ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని ఈ రీసెర్చ్ స్టడీలో స్పష్టం అయింది. బస్సుల్లో, మినీ వ్యాన్లలో ప్రయాణించడం ద్వారా ఈ టాక్సిన్స్ దరిచేరే అవకాశం తక్కువ అంటున్నారు శాస్త్రవేత్తలు. క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉండడం అందులో ఉపయోగించే ఏసీ టెక్నాలజీ వేరే ఉండటమే అందుకు కారణం అంటున్నారు. మీరు కారుతో వచ్చిన సీట్ కవర్లకి అదనంగా లెదర్ కవర్లు వేయిస్తున్నారా.. అయితే వాటి గురించి పూర్తిగా తెలుసుకుని జాగ్రత్త వహించండి. దీంతోపాటు కారుకు సంబంధించిన ఏసీ రిపేర్లు, గ్యాస్ ఫిల్లింగ్‌లు ఎక్కడపడితే అక్కడ చేయించడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..








