Career: పదే పదే కంపెనీలు మారం.. ఒకే సంస్థలో పనిచేస్తాం.. ఉద్యోగుల మూకుమ్మడి అభిప్రాయం ఇదే..
సాధారణంగా ఎక్కువ కంపెనీలు మారితే జీతం పెరుగుతుందని, అనుభవం వస్తుందని, మున్ముందు మనకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాం. అయితే ఇటీవల జరిగిన ఒక సర్వేలో వివిధ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో గొప్ప విషయమేమికంటే వారు తమ ఎదుగుదలను కోరుకుంటూనే, ప్రస్తుతం పనిచేస్తున్నకంపెనీలో కొనసాగడానికి ఇష్ట పడ్డారు.

ఉద్యోగం అనేది నేడు ప్రతి ఒక్కరికీ అత్యవసరం. జీవితంలో ముందుకు సాగాలంటే మంచి సంస్థను ఎంచుకోవడంతో పాటు దానిలో ఎదుగుదల బాగుండాలి. సాధారణంగా ఎక్కువ కంపెనీలు మారితే జీతం పెరుగుతుందని, అనుభవం వస్తుందని, మున్ముందు మనకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాం. అయితే ఇటీవల జరిగిన ఒక సర్వేలో వివిధ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో గొప్ప విషయమేమికంటే వారు తమ ఎదుగుదలను కోరుకుంటూనే, ప్రస్తుతం పనిచేస్తున్నకంపెనీలో కొనసాగడానికి ఇష్ట పడ్డారు.
ఆన్ లైన్ సర్వే..
ఆధునిక జాబ్ మార్కెట్ లో ఉద్యోగుల అంచనాలు, వారి ప్రాధాన్యతలపై అప్నా డాట్ కో అనే సంస్థ ఇటీవల ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. దేశంలోని వివిధ ఉద్యోగ రంగాల్లోని 10,000 మంది నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. దాని ప్రకారం వేతనం అనేది ప్రతి ఉద్యోగికీ ముఖ్యమైన విషయం. దీంతో పాటు వారు తమ కెరీర్ లో ఎదుగుదలను కోరుకుంటున్నారు. 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాలలో పురోగతి అవకాశాలను ఇష్టపడుతున్నారు. వృత్తిపరమైన వృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక కంపెనీలకు మారడం కన్నా ఎదుగుదలకు అవకాశం కలిగిన ఉన్న కంపెనీలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారు.
అనేక అంశాలు..
ఈ సర్వేలో ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల్లో 37 శాతం మంది తమ పనిలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 21 శాతం మంది అంతర్జాతీయ కార్యకలాపాలు, పని సంబంధిత ప్రయాణాలను చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలో పని విధానంపై ఆనందం వ్యక్తం చేశారు.
పురోగతి అవకాశాలు..
మొత్తానికి ఉద్యోగులలో చాలా మంది తమ సంస్థలో కొనసాగాలని కోరుకుంటున్నారు. దానితో పాటు కెరీర్ పురోగతి అవకాశాలు, పని విధానం, నైపుణ్యం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆన్ లైన్ సర్వే నివేదిక ప్రకారం.. దాదాపు 54 శాతం మంది ఉద్యోగులు తమ సంస్థలో నాయకత్వ బాధ్యతలకు విలువనిచ్చారు. 40 శాతం మంది అధునాతన శిక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు, అయితే 36 శాతం మంది పరిశ్రమ నిపుణులు, సీనియర్ నాయకత్వానికి ఓటు వేసి వారి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు.
అభినందనలు..
ఉద్యోగ నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, నైపుణ్యాలను పెంచుకోవవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. తద్వారా ఆయా సంస్థలకు ఉద్యోగులపై నమ్మకం పెరగడంతో పాటు వారి ఉన్నతికి ప్రోత్సాహం అందించే వీలు కలుగుతుందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








