AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio: జియో యూజర్లకు బంపరాఫర్‌.. ఈ రీఛార్జ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ కూడా..

రియలన్స్‌ జియో తాజాగా రూ. 857తో ప్రత్యేకంగా ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లకు ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను అందిస్తోంది. దీంతోపాటు జియోకు చెందిన జియో టీవీ...

Jio: జియో యూజర్లకు బంపరాఫర్‌.. ఈ రీఛార్జ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ కూడా..
Jio Plan
Narender Vaitla
|

Updated on: Apr 08, 2024 | 2:57 PM

Share

ఓటీటీ సేవల విస్తృతి బాగా పెరిగింది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఓటీటీ సేవలను వినియోగిస్తున్నారు. ఇక టెలికం సంస్థలు సైతం యూజర్లను ఆకట్టుకునేందుకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రియలన్స్‌ జియో తమ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ రీఛార్జ్‌ ప్లాన్‌ ఏంటి.? దీనివల్ల లభించే బెనిఫిట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రియలన్స్‌ జియో తాజాగా రూ. 857తో ప్రత్యేకంగా ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లకు ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ను అందిస్తోంది. దీంతోపాటు జియోకు చెందిన జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను కూడా పొందొచ్చు. రోజుకు 2 జీబీ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్‌ 64 కేబీపీఎస్‌తో వస్తుంది.

అయితే 5జీ నెట్‌వర్క్‌ లాంచింగ్‌ నేపథ్యంలో ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిడెట్‌ 5జీ డేటాను పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. జియో సినిమాలో ప్రీమియం యూజర్లకు ఈ ప్లాన్‌తో లభించదు. అలాగే రీఛార్జ్‌ వ్యాలిడిటీ ముగియగానే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సైతం ముగిసిపోతుంది. ఐపీఎల్‌ యూజర్లకు కూడా ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. కాగా జియో భారత్‌ ఫోన్‌ యూజర్ల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో రూ. 234తో రీఛార్జ్‌ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, జియోసావన్‌, జియో సినిమా వంటి సబ్‌స్క్రిప్షన్స్‌ పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..