Twitter: ట్విట్టర్ విక్రయానికి ఆమోదం తెలిపిన బోర్డు.. 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్న ఎలోన్ మస్క్..
ఎట్టాకేలకు ట్విట్టర్ అమ్మకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ట్విట్టర్ కొనుగోలుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దానికి బోర్డు కూడా ఒకే చెప్పింది...
ఎట్టాకేలకు ట్విట్టర్ అమ్మకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ట్విట్టర్ కొనుగోలుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి వాటాదార్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దానికి బోర్డు కూడా ఒకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ఛేంజీలకు ట్విటర్ సమాచారం ఇచ్చింది. మస్క్ గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలోనూ కొనుగోలుపై ఆసక్తిని స్పష్టం చేశారు. ఆయన ఆఫర్ చేసిన ధర కంటే ట్విటర్ షేరు విలువ ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, కొనుగోలుపై సందిగ్ధత ఏర్పడింది. అలాగే సోషల్ మీడియా నెట్‌వర్క్ స్పామ్, నకిలీ ఖాతాలపై డేటాను అందించకపోతే, ట్విట్టర్ ఇంక్‌ని కొనుగోలు చేయడానికి చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటానని మస్క్ హెచ్చరించాడు.
మైక్రోబ్లాగింగ్ సైట్ మొత్తం యూజర్‌బేస్‌లో స్పామ్ లేదా ఫేక్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాటిని గుర్తించే వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మే నెలలో మస్క్ చెప్పారు. ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారుల నుంచి 50 వేల కోట్ల రూపాయలకు పైగా సేకరించడంలో మస్క్ విజయవంతమయ్యాడు. ఈ ఫండ్ మొత్తం 19 మంది పెట్టుబడిదారుల నుంచి సేకరించాడు. మస్క్ పెట్టుబడి ప్రతిపాదనలో భాగమైన పెట్టుబడిదారులలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కూడా ఉన్నారు. అదనంగా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్సౌద్ మస్క్‌కు మద్దతుగా ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేయడానికి $35 మిలియన్లను తాకట్టు పెట్టారు. తాజా స్పష్టతతో మంగళవారం షేరు ధర సుమారు 3 శాతం పెరిగి 38.98 డాలర్లకు చేరుకుంది. ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ట్విటర్‌కు మస్క్ గతం ఏప్రిల్‌లో ఆఫర్ చేశారు. ఏప్రిల్ 5న కంపెనీ స్టాక్ ఈ ధర వద్ద ఉంది.