AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Card: ఈ కార్డు ఉంటే రూ.5 లక్షల వరకూ హాస్పిటల్ ఖర్చులు ఫ్రీ! ఇలా అప్లై చేసుకోండి!

అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు అనుకోని ఖర్చులు ఎదురవ్వొచ్చు. ఇలాంటప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు దీన్ని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. అదే ఆయుష్మాన్ కార్డు. ఇది ప్రభుత్వం తరఫున లభించే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటింది. దీనికి అర్హత కలిగిన కుటుంబాలు హాస్పిటల్స్ లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందొచ్చు. అయితే ఆయుష్మాన్ కార్డు కోసం మీరు ఇప్పుడే మీ ఇంటి నుండే అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Ayushman Card: ఈ కార్డు ఉంటే రూ.5 లక్షల వరకూ హాస్పిటల్ ఖర్చులు ఫ్రీ! ఇలా అప్లై చేసుకోండి!
Ayushman Card
Nikhil
|

Updated on: Oct 28, 2025 | 12:52 PM

Share

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) 2025 పథకం అనేది భారత ప్రభుత్వం యొక్క అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాలలో ఒకటి. దీన్నే ఆయుష్మాన్ కార్డు అని కూడా అంటారు. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు చేయూతనిస్తుంది. ఇందులో భాగంగాఏడాదికి రూ. 5 లక్షల వరకూ హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీనికి అర్హత పొందిన వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డుని జారీ చేస్తుంది. అదే ఆయుష్మాన్ కార్డ్. ఈ కార్డు కలిగిన వ్యక్తులు లేదా కుటుంబాలు ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఉచిత ఆరోగ్య సేవలను పొందగలుగుతారు. ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, లిస్టెడ్ ప్రైవేట్ ఆసుపత్రులలో చెల్లుతుంది, ఇక్కడ గుండె జబ్బులు, క్యాన్సర్, డయాలసిస్, శస్త్రచికిత్స వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కూడాఉచితంగా చేయబడుతుంది.

ఎలిజిబిలిటీ

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు అందరూ అర్హులు కారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. ఒకే గదిని కలిగి ఉన్న నివాసాలలో నివసించే కుటుంబాలు. 16 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబాలు. ఎలాంటి సపోర్ట్ లేని దివ్యాంగుల కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు, సొంత భూమిలేని కుటుంబాలు, గృహ కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, పారిశుధ్య కార్మికులు, రవాణా కార్మికులు (డ్రైవర్లు, కండక్టర్లు) వంటి వాళ్లు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.

అప్లికేషన్ ప్రాసెస్

ముందుగా అధికారిక ఆయుష్మాన్ భారత్ పోర్టల్( www.pmjay.gov.in)కు వెళ్లాలి.అక్కడ ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేయొచ్చు.  ఒకవేళ ఎలిజిబుల్ అయితే వెంటనే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు లేదా కామన్ సర్వీస్ సెంటర్‌(CSC)లను సందర్శించాలి. అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయడానికి ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ వంటి అవసరమైన గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి