AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Update: నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి! ఇకపై ఇంటినుంచే ఆ పని చేయొచ్చు

ఆధారు కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్‌డేట్ ఇచ్చింది. దేశమంతటా ఆధార్ కార్డుదారులకు కొన్ని ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు మార్పులు కనిపిస్తున్నాయి. వాటి గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Aadhaar Update: నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి! ఇకపై ఇంటినుంచే ఆ పని చేయొచ్చు
Aadhar Update
Nikhil
|

Updated on: Oct 28, 2025 | 2:02 PM

Share

ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చొనే పని లేకుండా అప్‌డేటింగ్ ప్రాసెస్ ఇప్పుడు సింపుల్ అయింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్..  ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు.  దీంతోపాటు మరికొన్ని రూల్స్ కూడా మారబోతున్నాయి. అవేంటంటే..

గవర్నమెంట్ ఐడీ ఉపయోగించి..

ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే.. దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్ డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారాయి.

  • పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్‌ అప్ డేట్ కి రూ. 75
  • వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్ డేట్ కి రూ. 125
  • 5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం.
  • ఆధార్ రీప్రింట్ అభ్యర్థనలకు రూ. 40

 ఆధార్ పాన్ లింక్

నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు.

ఈజీ కేవైసీ

నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవ్వనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసీ(KYC) చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా