Royal Enfield Bike: స్టన్నింగ్ లుక్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. లాంచింగ్ ఎప్పుడంటే?
భారతదేశంలో బైక్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ప్రత్యేక క్రేజ్. తెలుగు వారికి బుల్లెట్ బండిగా పరిచయం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకు అనుగుణంగా కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ మరో సూపర్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది ఈఐసీఎంఏలో తన సరికొత్త ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ ‘ఫ్లయింగ్ ఫ్లీ’ ను ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన తొలి ఆఫర్ అయిన సీ6 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రదర్శించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 మార్కెట్లోకి మార్చి 2026 నాటికి రానుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి.గోవిందరాజన్ క్యూ3 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఫలితాలన ప్రకటిస్తూ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 గురించి వివరాలను పేర్కొంది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 గురించి గోవిందరాజన్ మాట్లాడుతూ 2026 మొదటి త్రైమాసికం నాటికి ఇది మార్కెట్‌లోకి వచ్చే సమయం అవుతుందని స్పష్టం చేశారు.
ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి ఉప-బ్రాండ్ ఆర్ఈ కంటే భిన్నమైన గుర్తింపును అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ఆకాంక్షల కోసం ఒక సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిని భారతదేశంలో తమిళనాడులోని వల్లం వడగల్‌లోని బ్రాండ్‌కు సంబంధించిన తయారీ కేంద్రంలో నిర్మించనున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తూ బి.గోవిందరాజన్ కొత్త ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్‌లో బ్రాండ్ సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 అనేది పూర్తిగా కొత్త మరియు ఆధునిక అండర్‌పిన్నింగ్‌లతో కూడిన ఆర్‌ఈకు సంబంధించిన సాంప్రదాయ లైన్‌లతో కూడిన ఎలక్ట్రిక్ సిటీ బైక్ అని వివరించారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సీ6 ధరను ప్రస్తావించనప్పటికీ ఈ బైక్ దాదాపు రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ప్రీమియం ఎండ్‌లో ఉంచుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల స్పానిష్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు స్టార్క్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనుగోలు చేసింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు సంబంధించిన ఈవీల మొత్తం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే సీ6 (క్రూయిజర్), ఎస్6 (స్క్రాంబ్లర్) స్టార్క్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఆఫర్‌ల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్, దాని ఆశయాల గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలపనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








