AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phones: అమ్మకాల్లో ఆపిల్ రికార్డులు.. ఆ ఒక్క మోడల్‌తోనే నమ్మలేని ఆదాయం

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఆపిల్ ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌లోని భద్రతా ఫీచర్స్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఐఫోన్ల తయారీను ఆపిల్ కంపెనీ మొదలు పెట్టాక సేల్స్ అమాంతం పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాల్లో ఆపిల్ కంపెనీ రికార్డుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Phones: అమ్మకాల్లో ఆపిల్ రికార్డులు.. ఆ ఒక్క మోడల్‌తోనే నమ్మలేని ఆదాయం
ఆపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరించడం వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 2 లక్షల ఉద్యోగాలు ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ వంటి సరఫరాదారుల వద్ద నేరుగా లభిస్తాయి. అంతేకాకుండా, లాజిస్టిక్స్, కాంపోనెంట్ తయారీ, రిటైల్ రంగాల్లో మరో కొన్ని లక్షల పరోక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఇది భారత్‌లో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Nikhil
|

Updated on: Feb 22, 2025 | 3:49 PM

Share

ఆపిల్ ఐఫోన్ అమ్మకాల్లో ఈ సంవత్సరం 11 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం 9 బిలియన్ల డాలర్ల మాత్రమే ఆదాయం ఆర్జించిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ఆపిల్ ఐఫోన్ 16ఈ ద్వారా ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు. ఆపిల్ ఐఫోన్ 16 కంటే రూ. 20,000 తక్కువ ధరతో 16ఈ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో లాంచ్ చేసింది.  ఆపిల్ గత సంవత్సరం భారతదేశంలో దాదాపు 12 మిలియన్ ఐఫోన్‌లను విక్రయించింది. ఈ సంఖ్య వివో, శామ్‌సంగ్ కంటే చాలా తక్కువ. కానీ ఐఫోన్ అమ్మకపు ధర పరిశ్రమ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అందువల్ల ఆపిల్ భారతదేశంలో అత్యధికంగా రెవెన్యూ సంపాదించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.

కొత్త ఐఫోన్ 16ఈ ధరతో పాటు ఫీచర్ల పరంగా వివో, శామ్‌సంగ్ కంపెనీ ఫోన్లకు గట్టి పోటినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆపిల్ ఈ సంవత్సరం దాదాపు 15 మిలియన్ యూనిట్ల ఐఫోన్‌లను విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16ఈ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఏ18 చిప్ ద్వారా ఆధారంగా పని చేస్తుంది. ఆపిల్‌కు సంబంధించిన ఇన్-హౌస్ సీ1 మోడెమ్‌ను కూడా ప్రారంభిస్తుందని, అలాగే కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా అధునాతన రైటింగ్ టూల్స్, విజువల్ ఇంటెలిజెన్స్ వంటి ఏఐ  ఆధారిత లక్షణాలు యూజర్లు అనుభూతి చెందుతారు. అదనపు ఫీచర్ల విషయానికి వస్తే యాక్షన్ బటన్, ఫేస్ ఐడీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటివి ఆకట్టుకుంటాయి. భారతదేశంలో ఐఫోన్ 16ఈ 128 జీబీ వేరియంట్ ధర రూ.59,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.69,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.89,900గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 21న ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా  ఫిబ్రవరి 28న ఈ ఫోన్ డెలివరీలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా రిలీజ్ చేసిన ఐఫోన్ 16ఈ ఫోన్లు సేల్స్‌పరంగా ఆపిల్ కంపెనీకు మంచి అసెట్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి